Tirumala Goshala controversy (Image Source: Twitter)
తిరుపతి

Tirumala Goshala controversy: అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి ఏం జరిగిందంటే?

Tirumala Goshala controversy: తిరుమల ఎస్వీ గోశాల అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అక్కడ దాదాపు 100 గోవులు చనిపోయాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) చేసిన ఆరోపణలు ఒక్కసారిగా అందరినీ ఉలికిపాటుకు గురి చేశాయి. అయితే ఇది అవాస్తవమని టీడీపీ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరూపించాలంటూ భూమనకు ఛాలెంజ్ సైతం చేసింది. ఇందుకు అంగీకరించిన భూమన.. ఇవాళ గోశాలకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే పోలీసులు (Tirupati Police) తనను అడ్డుకున్నట్లు భూమన చెప్పగా.. దానిని తిరుపతి ఎస్పీ (Tirupati SP) ఖండించారు.

ఎస్వీ గోశాలలో గోవులు చనిపోయానని నిరూపించేందుకు ఉదయం 10 గంటలకు అక్కడికి వెళ్తానని భూమన కరుణాకర్ రెడ్డి ముందే ప్రకటించారు. అయితే అతడ్ని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుపడ్డారని వైసీపీ (YSRCP) ప్రచారం చేసింది. భూమనను హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారంటూ వైసీపీ నేతలు మాట్లాడారు. అయితే ఈ ప్రచారాన్ని చిత్తూరు ఎస్పీ హర్షవర్ధన్ (SP Harsha Vardhan) ఖండించారు. గోశాలకు వెళ్లేందుకు భూమనకు అనుమతిచ్చామని అన్నారు. అయితే రెండు పార్టీలు ఒకేసారి వెళ్లకూడదని మాత్రం కండిషన్ పెట్టినట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Also Read: Dharmapuri Arvind on Kavitha: కవితకు బ్యూటీ పార్లర్ వల్ల ఫేమ్ వచ్చిందా? ధర్మపురి అర్వింద్ సూటి ప్రశ్న

మరోవైపు ఎస్వీ గోశాలకు వెళ్లిన భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయరెడ్డి అక్కడ హల్ చల్ చేశారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లమని వారిస్తున్న వినకుండా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు కలుగ చేసుకొని అతడ్ని బలవంతంగా అక్కడ నుంచి తీసుకెళ్లారు. అతడి కారులో బలవంతంగా కూర్చోబెట్టి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ వీడియోను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నారు. గోశాల వద్ద అభినయరెడ్డి ఓవరాక్షన్ అంటూ వీడియోను ట్రెండింగ్ చేస్తున్నారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం