Tirumala Updates (image credit:TTD)
తిరుపతి

Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. కీలక సూచన చేసిన టిటిడి..

Tirumala Updates: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా శ్రీవారి భక్తులు.. గోవింద నామస్మరణ సాగిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. అలిపిరి కాలినడక మార్గాన ఎందరో భక్తులు.. నడక సాగిస్తూ తిరుమలకు చేరుకుంటున్నారు. గోవిందా అంటూ నామస్మరణ సాగిస్తే చాలు.. శ్రీ వేంకటేశ్వరుని కరుణ కటాక్షం తమపై ఉంటుందని భక్తుల విశ్వాసం.

అందుకే శ్రీ శ్రీనివాసుని దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలకు తరలివస్తారు. ప్రస్తుతం పరీక్షల కాలం కావడంతో.. ఎందరో విద్యార్థులు తిరుమలకు చేరుకునే శ్రీ శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని పొందారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.

శ్రీవారి దర్శన సమాచారం..
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికై 18 గంటల సమయం పట్టే అవకాశం ఉందని టిటిడి ప్రకటించింది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు ప్రస్తుతం వేచి ఉన్నారు. శనివారం రికార్డు స్థాయిలో 82,580 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 31,905 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శనివారం రూ. 4 నాలుగు కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి ప్రకటించింది.

భక్తులకు టిటిడి ప్రత్యేక సూచన..
తిరుమల క్షేత్రానికి వచ్చే శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. ఇటీవల శ్రీవారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, వసతి గదుల బుకింగ్ కు సంబంధించి నకిలీ వెబ్ సైట్లు ఉన్నట్లు టిటిడి గుర్తించింది. ఇప్పటికే పలువురిని గుర్తించి అరెస్ట్ చేయగా, శ్రీవారి భక్తులు ఇటువంటి మోసాల పట్ల జాగ్రత్త వహించాలని టిటిడి కోరింది. నకిలీ వెబ్సైట్లపై టిటిడి నిఘా భద్రత విభాగం ప్రత్యేక నిఘా ఉంచిందని, ఇటువంటి వాటి సమాచారాన్ని నేరుగా టిటిడికి అందించాలని టిటిడి అధికారులు కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను మాత్రమే ఉపయోగించాలని, ఏదైనా సమాచారం కోసం టిటిడి కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 155257కు సంప్రదించాలని కోరారు.

శ్రీవారి సేవకుల సేవకు భక్తుల హర్షం..
అమ‌రావ‌తిలోని వెంక‌ట‌పాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగ‌ణంలో నిర్వ‌హించిన శ్రీ‌వారి క‌ల్యాణాన్ని వీక్షించేందుకు విచ్చేసిన వేలాది మంది భక్తులకు శ్రీవారి సేవకులు ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో, భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో విశేషంగా సేవలందించారు. దాదాపు 1500 మంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, విజిలెన్స్‌ విభాగాలకు సంబంధించి క‌ల్యాణ వేదిక‌ ప్రాంతాలలో భక్తులకు సేవలందించారు.

Also Read: IMD Cyclone Alert: ఇదేం విడ్డూరం.. సమ్మర్ లో భారీ వర్ష సూచన

శనివారం సాయంత్రం నుండి గ్యాలరీల్లో వేచి ఉన్న‌ భక్తులకు తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు అందించారు. అదేవిధంగా భ‌క్తుల‌కు శ్రీవారి లడ్డు, పసుపు, కుంకుమ ప్యాకెట్, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తక ప్రసాదం, కల్యాణోత్సవం అక్షింతలు కలిపి ఉన్న‌ బ్యాగ్ ల‌ను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేశారు. భక్తులు గ్యాలరీలలోనికి వచ్చేందుకు మాడ వీధులలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, గ్యాలరీలలోని ముఖ్యమైన ప్రాంతాలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు టిటిడి అధికారులకు, సిబ్బందికి సహకరించారు. శ్రీ‌నివాస క‌ల్యాణానికి విచ్చేసే భక్తులకు 150 మంది శ్రీవారి సేవకులు తిరునామధారణ సేవలందించారు. అమ‌రావ‌తి స‌రిస‌ర ప్రాంతాల నుండి విచ్చేసిన‌ శ్రీవారి సేవకులు అందించిన సేవల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేసి అభినందించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం