NHRC: తిరుపతి దాడి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌
Nhrc
తిరుపతి

NHRC: తిరుపతి దాడి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్‌

న్యూ ఢిల్లీ, స్వేచ్ఛ: తిరుపతి నగర కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా జరిగిన దాడికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారనే దానిపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు ఈనెల 3న బస్సులో కార్పొరేషన్‌కు వెళ్తుండగా, ఇద్దరు రౌడీషీటర్ల ఆధ్వర్యంలో దుండగులు బస్సును ఆపి, దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు. అంతేకాదు బస్సు టైర్లలో గాలి తీయడంతో పాటు, బస్సు కిటికీల అద్దాలు, చివరకు డోర్ల అద్దాలు కూడా ధ్వంసం చేసి డ్రైవర్‌పై చేయి చేసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే పట్టపగలు ఈ దాడి జరిగిందన్నది వైసీపీ ఆరోపణ. కార్పొరేటర్లను కిడ్నాప్‌ చేయాలన్న ఉద్దేశంతో దుండగులు ఈ పని చేశారని వైసీపీ తీవ్రంగా మండిపడింది. జరిగిన ఘటనపై వెంటనే పూర్తి వివరాలతో, ప్రధాన నిందితుల పేర్లతో సహా జిల్లా ఎస్పీకి వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆధారాలతో 14న తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. దీనిపై కమిషన్‌ సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది.

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం