Narayana School : తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ప్రముఖ విద్యాసంస్థ నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది. తిరుపతిలోని (Tirupathi) బోడిలింగాల పాడు వద్ద బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో కొందరికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయపడ్డ స్టూడెంట్లను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణం అని అంటున్నారు స్థానికులు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. స్కూల్ యాజమాన్యం దీనిపై ఇంకా స్పందించలేదు.