TTD: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉగాది పండుగ .. సెలవులు రావటంతో.. భక్తులు భారీగా వెళ్తున్నారు. టోకెన్లు లేని భక్తులు దేవుని దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఉచిత దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. SSD దర్శనానికి 7 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మార్చి 31 న 76 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22 వేల 7 వందల మంది తలనీలాలు సమర్పించారు. 31 న రోజు హుండీ ఆదాయం రూ. 3.04 కోట్లు అని టిటిడి అధికారులు తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
