Hyderabad Traffic: NH-44 ఎలివేటెడ్ కారిడార్ వర్క్స్ కోసం కీలక మళ్లింపులు
పారడైజ్ జంక్షన్ నుండి డెయిరీ ఫామ్ రోడ్ వరకు NH-44పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, 30 అక్టోబర్ 2025 నుండి దాదాపు 9 నెలల పాటు ట్రాఫిక్ ఏర్పాట్లు మారనున్నాయి. ఈ పనులు సజావుగా సాగేందుకు కొన్ని రోడ్లు తాత్కాలికంగా మూసివేయనున్నారు. ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తాం.
రోడ్ క్లోజర్ డీటెయిల్స్ ఇవే..
రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ నుండి బాలంరాయ్ వరకు రోడ్డు రెండు వైపులా పూర్తిగా మూసివేయబడుతుంది. చుట్టుపక్కల జంక్షన్లలో భారీ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో, బాలంరాయ్ నుండి CTO జంక్షన్ వరకు ఈ రూట్‌ను పూర్తిగా నివారించండి. మీ ప్రయాణం సులువుగా సాగాలంటే ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి.
ప్రత్యామ్నాయ మార్గాలు – మీ గమ్యానికి సులువైన రూట్స్
1. బాలానగర్ వైపు నుండి పంజాగుట్ట/ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ట్రాఫిక్ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించవచ్చు. తాడ్‌బండ్ → మస్తాన్ కేఫ్ → డైమండ్ పాయింట్ → కుడి వైపు మలుపు → మడ్‌ఫోర్ట్ → NCC → JBS → SBI.
2. సుచిత్ర వైపు నుండి పంజాగుట్ట/ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ట్రాఫిక్ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించవచ్చు: సేఫ్ ఎక్స్‌ప్రెస్ – ఎడమ మలుపు – బాపూజీ నగర్ – సెంటర్ పాయింట్ – డైమండ్ పాయింట్ – ముడ్‌ఫోర్ట్ – NCC – JBS – SBI.
Also Read: GHMC Commissioner: ఎన్నికల నిబంధన ప్రకారమే విధులు నిర్వర్తించాలి : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్
3. ట్యాంక్ బండ్ / రాణి గంజ్ / పంజాగుట్ట / రసూల్‌పురా / ప్లాజా నుండి CTO జంక్షన్ ద్వారా తాడ్‌బండ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ వద్ద అన్నా నగర్ – బాలమ్రాయ్ – తాడ్‌బండ్ వైపు మళ్లిస్తారు.
4. పంజాగుట్ట/ట్యాంక్ బండ్ వైపు వెళ్లాలనుకునే అన్నా నగర్ నివాసితులు రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ వైపు తప్పుడు మార్గాన్ని తీసుకోకుండా బైలేన్‌లను (మీటింగ్ పాయింట్ బైలేన్, హాకీ గ్రౌండ్ బైలేన్ మరియు L&O పోలీస్ స్టేషన్ బైలేన్) ఉపయోగించాలని సూచించారు.
వాహనదారులు ఈ కొత్త మార్గాలను దృష్టిలో పెట్టుకుని, వాటిని ఉపయోగించుకోవాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోరారు.
