Private Colleges (imagecredit:twitter)
తెలంగాణ

Private Colleges: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఈనెల 15 నుంచి కాలేజీలు బంద్..?

Private Colleges: ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్ తో వృత్తివిద్య, డిగ్రీ(Degree), పీజీ(PG) ప్రైవేట్(Private) యాజమాన్యాలు కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. ఈనెల 15 నుంచి వృత్తి విద్యాకాలేజీలు, ఈనెల 16 నుంచి డిగ్రీ, పీజీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. కాగా శుక్రవారం ఈ బకాయిలు రిలీజ్ చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డిని వృత్తివిద్యా కళాశాలల యాజమాన్యాలు కలిశాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదలచేయాలని ఈ సందర్భంగా కోరాయి.

రూ.1200 కోట్ల టోకెన్ అమౌంట్ అయినా..

గడిచిన విద్యాసంవత్సరం నాటికి రూ.7500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని వారు ఉన్నత విద్యామండలి చైర్మన్ కు వివరించారు. ఈ ఏడాది రూ.2700 కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. 6 నెలల నుంచి ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి స్పందన లేకపోయిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.1200 కోట్ల టోకెన్ అమౌంట్ అయినా మంజూరు చేయాలని వారు ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి(Balakrishna Reddy) దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో దసరా వస్తోందని, కనీసం అటెండర్లు, సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు.

Also Read: Raghava Lawrence: అప్పుడు కష్టపడిన డబ్బుతో కొన్న ఇంటిని.. లారెన్స్ ఏం చేశాడో తెలుసా?

12 లక్షలకు పైగా విద్యార్థుల

ప్రభుత్వం అలసత్వం వహిస్తుండటంతో 12 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్ రోడ్డుపై పడుతోందని వారు పేర్కొన్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో అధ్యాపకులు కాలేజీలకు ఎందుకు రావాలని ప్రశ్నిస్తున్నారన్నారు. ఈనెల 15న ఇంజినీరింగ్(Engineering), ఫార్మసీ(Pharmacy), లా(Law), బీఈడీ(BED), ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) కాలేజీలకు బంద్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈనెల 16 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ చేస్తున్నట్టు ప్రైవేట్ యాజమాన్యాలు స్పష్టంచేశాయి.

Also Read: Dasoju Sravan: గ్రూప్1 పరీక్షను తిరిగి నిర్వహించాలి.. ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

Just In

01

Matrimonial Scam: ఓ అందమైన అమ్మాయి కోసం వెళ్లాడు.. తీరా చూస్తే అక్కడ..?

CM Hyd Tour: సీఎం రేవంత్ సిటీ టూర్‌కు ముహూర్తం ఫిక్స్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం!

GHMC: బల్దియాలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. అదేంటంటే..?

Crime News: పట్టపగలే శంకర్ పల్లిలో దారి దోపిడీ.. మధ్యలో కారు ప్రమాదం.. చివరికి..?

GST 2.0: చిరు తిండ్లు తినేవారికి కేంద్రం గుడ్ న్యూస్.. ఇక మీ పంట పండినట్లే!