CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాబోయే రెండు వారాల పాటు అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడపనున్నారు. అటు రాష్ట్రంలోని జిల్లాల పర్యటనలు, ఇటు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల వేట కోసం విదేశీ పర్యటనలతో ఆయన క్యాలెండర్ కిక్కిరిసిపోయింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు సాగనున్న ఈ పర్యటనల వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాల పర్యటనలు
జనవరి 16 (నిర్మల్ జిల్లా): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిర్మల్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనవరి 17 (మహబూబ్‌నగర్ జిల్లా) సొంత జిల్లా పర్యటనలో భాగంగా జడ్చర్లలో IIIT కాలేజీకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్ పట్టణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
జనవరి 18 (ఖమ్మం & మేడారం): ఉదయం: పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొంటారు.
సాయంత్రం: ఖమ్మం పట్టణంలో సీపీఐ నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. రాత్రి ఖమ్మం పర్యటన ముగించుకుని నేరుగా మేడారం చేరుకుంటారు. అక్కడే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంనిర్వహిస్తారు. రాత్రికి మంత్రులతో కలిసి మేడారంలోనే బస చేస్తారు.
Also Read: Supreme Court: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఏ పై.. ఎటూ తేలని వ్యవహారం
జనవరి 19 (మేడారం దర్శనం): ఉదయం కుటుంబ సభ్యులు మరియు మంత్రులతో కలిసి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుంటారు. మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు. దావోస్ మరియు అమెరికా పర్యటనలు (పెట్టుబడుల వేట) రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.
జనవరి 19 రాత్రి: మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం బృందం దావోస్ బయలుదేరుతుంది.
జనవరి 20 – 23: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) సదస్సులో సీఎం పాల్గొంటారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అయి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు.
జనవరి 24: దావోస్ పర్యటన ముగించుకుని అక్కడి నుండి నేరుగా అమెరికా (US) బయలుదేరుతారు. అక్కడ పలు ఐటీ మరియు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు.
ఫిబ్రవరి 1: విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.ముఖ్యమంత్రి పర్యటనలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రచారం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు , పార్టీ సంస్థాగత మార్పులపై కూడా ఈ పర్యటనల మధ్యే కసరత్తు చేసే అవకాశం ఉంది.మొత్తానికి, వచ్చే 15 రోజులు పాలన, రాజకీయం , పారిశ్రామిక ప్రగతి దిశగా సీఎం రేవంత్ రెడ్డి వేగంగా అడుగులు వేయబోతున్నారు.
Also Read: Damodar Raja Narasimha: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో 996 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!

