Minister Seethakka: పంచాయతీ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Minister Seethakka (imagecredit:twitter)
Political News, Telangana News

Minister Seethakka: పంచాయతీ సవరణ బిల్లుల‌కు అసెంబ్లీ ఆమోదం.. ముఖ్య అంశాలివే..!

Minister Seethakka: ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను సడలిస్తూ అసెంబ్లీ శనివారం పంచాయతీరాజ్ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasada Kumar) ఆదేశాల మేరకు ఈ బిల్లులను మంత్రి సీతక్క(Ministers Seethakka) ప్రవేశపెడుతూ వనపర్తి జిల్లాలో జైన్ తిరుమలాపూర్ గ్రామం పేరును జయన్న తిరుమలాపూర్‌గా మార్చాలని ప్రతిపాదన పెట్టారు. ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ చిన్నారెడ్డి ముత్తాత పేరు జయన్నగా ఉండేదని, ఆయన పేరుపై ఉన్న గ్రామం పేరు కాలక్రమేనా జైన్ తిరుమలాపూర్‌గా ముద్రపడిందని, దాన్ని జయన్న తిరుమలాపూర్‌గా మార్చాలని సీతక్క సభ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల పేర్ల మార్పు, చట్ట సవరణ బిల్లులపై స్పీకర్ చర్చకు అనుమతించారు.

వెంకట రమణ రెడ్డి

ఈ సందర్భంగా అధికార పార్టీ సభ్యుడు ఆది నారాయణ(Adhi Narayana) మాట్లాడుతూ, ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికకు అనర్హలుగా పరిగణించే పంచాయతీరాజ్ నిబంధనను సడలిస్తూ నిర్ణయం తీసుకుని, బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు ఈ రోజు గొప్ప రోజు అని వ్యాఖ్యానించారు. ఈ సవరణ బిల్లులకు తాను పూర్తిగా మద్దతు పలుకున్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ సభ్యుడు వెంకట రమణ రెడ్డి(Venkataraman Reddy) మాట్లాడుతూ, ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హులుగా పరిగణించే ఈ నిబంధనను గతంలో మున్సిపల్‌లో ఎత్తి వేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ నిబంధనను సడలిస్తూ చట్ట సవరణ చేయాలని భావిస్తున్న సర్కారు మరోసారి ఈ విషయాన్ని పరిశీలించాలని, సవరించాలని భావించడం సభ్యత కాదని వ్యాఖ్యానించారు.

Also Read: Naa Anveshana: నా అన్వేష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి బీజేపీ.. దేశ ద్రోహంపై నోటీసులు!

పాల్వాయి హరీశ్ బాబు

పొలిటికల్ బెనిఫిట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ, పంచాయతీ రాజ్ చట్టసవరణ బిల్లులను తాము సమర్థించడం లేదన్నారు. తమ నియోజకవర్గంలో తాను ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడని పేరుతో ఉన్న ఓ ప్రాంతం పేరును నంది గూడగా మార్చాలని సభను కోరారు. దీంతో పాటు వనపర్తి జిల్లాలోని జైన్ తిరుమలాపూర్ ప్రాంతం పేరును జయన్న తిరుమలాపూర్‌గా మార్చాలని ప్రతిపాదించారు. లంబాడీ మిట్టి అంటూ మరో గ్రామం పేరు ఉన్నదని, దాన్ని ప్రేమ్‌నగర్‌గా మార్చాలని కోరారు. అధికార పార్టీ సభ్యుడు రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తమ జిల్లాలోని దోమ మండలం పరిధిలో దొంగల ఎన్కేపల్లి పేరిట ఓ గ్రామం ఉందని, వాస్తవానికి ఆ గ్రామంలో విద్యావంతులు, మేధావులుంటారని, ఆ గ్రామం పేరు దొంగల ఎన్కేపల్లి అంటూ పడిపోయిందని, ఆ పేరును సంజీవనగర్‌గా మార్చాలని సభాముఖంగా కోరారు.

కూనంనేని సాంబశివరావు

సీపీఐ శాసన సభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు(Kunamnenei Sambashiva Rao) మాట్లాడుతూ, ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికలకు అనర్హులుగా ఉన్న నిబంధనను సవరించటం మంచి పద్దతి కాదన్నారు. ఇద్దరు పిల్లలుంటే పోటీకి అనర్హులనే నిబంధననే తాము బలపరుస్తున్నామని స్పష్టం చేశారు. జనాభాలో ఎక్కువ వయస్సు కలిగిన వారు పెరుగుతున్నారన్న ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో జనాభా స్వీయ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, జనాభా స్వీయ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సభ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. ఆయా గ్రామాలు, ప్రాంతాల పేర్ల మార్పు విషయంపై త్వరలోనే కలెక్టర్ల నుంచి తగిన ఆదేశాలు జారీ చేయించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Also Read: MLC Kavitha: అమరుల కుటుంబాలకు కోటి అందే వరకు పోరాటం.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

Just In

01

Indian Woman Murder: అమెరికాలో ఘోరం.. భారత సంతతి యువతి దారుణ హత్య.. ఏం జరిగిందంటే?

Vijay Kumar: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు వార్నింగ్..ఈ రూల్స్ పాటించాల్సిందే : అదనపు డీజీపీ విజయ్ కుమార్

Phone Tapping Case: హరీశ్ విచారణకు అనుమతివ్వండి.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్!

MLC Naveen Rao: ఆరోపణల పేరుతో అవాస్తవాలను నమ్మొద్దు.. సిట్ ఎప్పుడు పిలిచినా సహకరిస్తా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు!

BRS: వాకౌట్ చేసి తప్పు చేశామా? గులాబీ గూటిలో ఒక్కటే చర్చ!