Srinivas Goud: పాలమూరు పచ్చబడితే కాంగ్రెస్ కళ్లు ఎర్రబడ్డాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) ఆరోపించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే పీసీసి అధ్యక్షులు,మంత్రులు అయ్యారు.. కేసీఆర్ మాట్లాడిన అంశాలపై రివ్యూ చేసుకోండి.. అలాకాకుండా కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎస్.ఎల్.బి.సి(SLBC) కుప్పకూలి మనుషులు చనిపోతే శవాలు తీయలేదు.. 7 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రింకింగ్ వాటర్ కోసం ఎవరి అనుమతులు అవసరం లేదు.. రిజర్వాయర్లన్నీ డ్రింకింగ్ వాటర్ కోసం కట్టారా…? అని నిలదీశారు. పాలమూరు, రంగారెడ్డికి ఏడు అనుమతులు బిఆర్ఎస్ హయాంలోనే వచ్చాయని, 45 టీఎంసీలు అంటే మహబూబ్ నగర్(Mahabubnagar), రంగారెడ్డి(Rangareddy),నల్గొండ జిల్లాలు ఏం కావాలి అని నిలదీశారు.
తొమ్మిది జిల్లాలు కరువు
రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం, లోక్ సభ సభ్యులు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అన్నారు. తెలంగాణ హక్కుల గురించి బరాబర్ మాట్లాడుతామని, ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) చర్చకు రావాలని, మీ మొహాలకు రైతులకు యూరియా ఇవ్వలేదు.. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్(Hyderabad) తప్ప తెలంగాణలో ఉన్న తొమ్మిది జిల్లాలు కరువు జిల్లాలుగా ఉండేవి అని, కేసీఆర్(KCR) ను చూసి గజగజ వణుకుతున్నారన్నారు. రెండు ఏళ్లల్లో మీ పని అయిపోవడం ఖాయం.. పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. 45 టీఎంసిలకు ఒప్పుకుంటే పాలమూరును దగా చేసినట్లే అన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో కాదు పెట్టేది ఢిల్లీలో పెట్టాలని సూచించారు.
Also Read: Hyderabad Crime: సెల్ ఫోన్ గొడవ.. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు..?
దమ్ముంటే ఎన్నికలు పెట్టండి
మాజీమంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ను కాంగ్రెస్ పెండింగ్ ప్రాజెక్టుగా మార్చిందన్నారు. 45 టీఎంసిలు ఇస్తామన్న కేంద్రం సూచనకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. పాలమూరు జిల్లాను భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ అని ఆరోపించారు. పాలమూరును వలసల జిల్లాగా కాంగ్రెస్(Congress) మార్చిందని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎంపీటీసీ(MPTC), జెడ్పిటీసీ(ZPTC) ఎన్నికలు పెట్టండి అని సవాల్ చేశారు. దేశానికి,రాష్ట్రానికి కాంగ్రెస్ అష్ట దరిద్రం అన్నారు. కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డిపై సూచనలు ఇచ్చారు ఏం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
Also Read: Sigma Telugu Teaser: దళపతి విజయ్ తనయుడి ‘సిగ్మా’ టీజర్ ఎలా ఉందంటే..

