Sigma Telugu Teaser: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan), కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘సిగ్మా’ (Sigma). లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) పతాకంపై సుభాస్కరణ్ (Subaskaran) నిర్మిస్తున్న ఈ జెన్-జీ విజిలెంట్ యాక్షన్ అడ్వెంచర్ టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దళపతి విజయ్ వారసుడిగా కాకుండా, ఒక ప్రతిభావంతుడైన దర్శకుడిగా జేసన్ సంజయ్ తన మొదటి ముద్రను బలంగా వేశాడనేది ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. విజిలెంట్ హీరో కథాంశాన్ని నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా స్టైలిష్‌గా, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో వెండితెరపై ఆవిష్కరించినట్లుగా ఈ టీజర్ చెప్పేస్తుంది. ముఖ్యంగా దళపతి విజయ్ సినిమాల్లో ఉండే మాస్ ఎలిమెంట్స్‌ను, మోడరన్ మేకింగ్‌తో జేసన్ సంజయ్ మిక్స్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. టీజర్‌ను గమనిస్తే..
Also Read- Sivaji Comments: శివాజీ కామెంట్స్‌పై బేషరతు క్షమాపణ కోరుతూ.. ‘మా’కు ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ ఫిర్యాదు..
పవర్‌ఫుల్ డైలాగ్.. అదిరిపోయే యాక్షన్
టీజర్ ఆరంభంలోనే కథానాయకుడు చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ‘‘నన్ను మీరు మంచివాడిగా చూస్తారా, గొప్పవాడిగా చూస్తారా, చెడ్డవాడిగానా లేక రాక్షసుడిగానా అనేది మీరు నన్ను చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. కానీ ఈ క్షణంలో నన్ను నేను కాపాడుకోవడానికి, ఏ రూపానికైనా మారడానికి సిద్ధం’’ అంటూ సందీప్ కిషన్ చెప్పే డైలాగ్, ఈ సినిమాలో హీరో పాత్రలో ఉన్న షేడ్స్‌ని పరిచయం చేసింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ మునుపెన్నడూ లేని విధంగా ఒక రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. తన బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీతో టీజర్ మొత్తాన్ని తన భుజాలపై మోశారు. యాక్షన్ సీన్లలో ఆయన చూపించిన ఎనర్జీ, యాటిట్యూడ్ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. టీజర్ తర్వాత సినిమాపై భారీగా అంచనాలు మొదలవుతాయనడంలో అతిశయోక్తి లేనే లేదు.
Also Read- Champion: ఛాంపియన్‌తో ఛాంపియన్.. నితీష్ కుమార్ రెడ్డి ఫేవరేట్ హీరో, హీరోయిన్లు ఎవరంటే?
కాన్సెప్ట్ ఇదే..
సాంకేతికంగానూ ఈ సినిమా హైలెట్ అనేలా ఉంది. ఎస్. థమన్ (Thaman S) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పల్సేటింగ్ మ్యూజిక్‌తో టీజర్ కట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లారు. అలాగే కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అత్యున్నత స్థాయిలో ఉంది. రిచ్ విజువల్స్ సినిమాకు క్లాసీ లుక్ ఇచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ తమ మేకింగ్ స్టైల్‌కు తగ్గట్టుగానే ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్ర కాన్సెప్ట్ విషయానికి వస్తే.. ఒక రహస్య నిధి వేట చుట్టూ ఈ కథ తిరుగుతుందని, అందులో థ్రిల్లింగ్ ట్విస్టులు ఉంటాయని సమాచారం. సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా, కీలక పాత్రల్లో రాజు సుందరం, సంపత్ రాజ్, శరత్ లోహితస్వా తదితరులు కనిపించనున్నారు. కేథరిన్ థ్రెసా ఒక స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మల్టీలింగువల్ చిత్రాన్ని 2026 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

