Champion: స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ (Champion) అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రోషన్ (Roshan Meka), అనస్వర రాజన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా చిత్ర హీరో రోషన్.. ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)ని కలిసి, కాసేపు ముచ్చటించారు. దీంతో ఈ సినిమాపై గ్లోబల్‌గా ప్రచారం కల్పించినట్లయింది. ఛాంపియన్‌ని కలిసిన ఛాంపియన్ అంటూ మేకర్స్ వారిద్దరి మీట్ (CHAMPION meets CHAMPION)కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read- Ram Gopal Varma: శివాజీ వ్యాఖ్యలపై రగిలిన చిచ్చు.. వర్మ ఎంట్రీతో పీక్స్‌కు చేరిన వివాదం!
తప్పకుండా సినిమాను చూస్తా
టీమ్ ఇండియాలో మన తెలుగు కుర్రాడైన నితీష్ కుమార్ రెడ్డి ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలియంది కాదు. అలాంటి ఆటగాడిని రోషన్ ఎలా మీట్ అయ్యాడనేది? పక్కన పెడితే, వారిద్దరి సంభాషణ మాత్రం ఇద్దరు స్నేహితులు ముచ్చటించుకుంటున్నట్లుగా ఉండటం విశేషం. వారి సంభాషణను గమనిస్తే.. ముందుగా నితీష్ ‘ఛాంపియన్’ హీరో రోషన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మూవీ ఎప్పుడు రిలీజ్ అని అడిగారు. అందుకు రోషన్.. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలవుతుంది.. కాకపోతే 24 సాయంత్రం నుంచే ప్రీమియర్స్ పడుతున్నాయని చెప్పారు. తప్పకుండా ఈ సినిమాను చూస్తానని నితీష్ కుమార్ చెబుతున్నారు. అనంతరం నీ ఛాంపియన్ ఎవరు? అని నితీష్ అడిగారు.
రియల్ లైఫ్‌లో ఛాంపియన్
అందుకు రోషన్ సమాధానమిస్తూ.. ‘నా రియల్ లైఫ్‌లో నా ఛాంపియన్ మా నాన్నే’ అని నీకెవరు? అని నితీష్‌ని ప్రశ్నించారు. ‘మా డాడీనే. నా కోసం ఎన్నో త్యాగం చేసి, ఈ రోజు నేను ఇక్కడ వరకు వచ్చేలా చేశారు. అందుకే మా నాన్నే నా ఛాంపియన్’ అని నితీష్ తెలిపారు. నీ ఫేవరేట్ క్రికెట్ ఎవరు అని రోషన్‌ని నితీష్ అడగగానే.. ‘ఎమ్.ఎస్. ధోని’ అని సమాధానమిచ్చారు. నాకు కూడా ధోని అంటే ఇష్టమని చెప్పిన నితీష్.. నువ్వు హైదరాబాదివి కదా.. ఐపీఎల్‌లో ఏ జట్టు అంటే ఇష్టమని అడగగా.. ‘చెన్నై సూపర్ కింగ్స్’ అని చెప్పారు రోషన్.
Also Read- Manoj Manchu: మహిళల వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యలు.. మంచు మనోజ్ షాకింగ్ పోస్ట్!
ఫేవరేట్ యాక్టర్ ఎవరు?
నీ ఫేవరేట్ యాక్టర్ ఎవరని రోషన్ అడిగిన ప్రశ్నకు.. ‘మహేష్ బాబు’ అని నితీష్ సమాధానమిచ్చారు. మరి నీ ఫేవరేట్ అని అంటే.. ‘ఒక యాక్టర్‌ని అలా అడగకూడదు’ అంటూ రోషన్ తప్పించుకున్నాడు. సరే.. హీరోయిన్ ఎవరంటే.. వెంటనే రోషన్.. ‘సమంత’ అని చెప్పారు. మరి నీకు అనగానే.. ‘కాజల్ అగర్వాల్’ అని నితీష్ చెప్పారు. మా టీమ్‌తో కలిసి నీ సినిమాను చూస్తాను అని నితీష్ చెప్పగానే.. ‘థ్యాంక్యూ సో మచ్’ అంటూ రోషన్ చెప్పారు. అలా వారిద్దరి మధ్య ఆసక్తికరంగా సంభాషణ నడిచింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

