Rangareddy Congress: రంగారెడ్డి జిల్లాలో విచిత్ర రాజకీయం
Rangareddy Congress (imagecredit:twitter)
రంగారెడ్డి

Rangareddy Congress: రంగారెడ్డి జిల్లాలో విచిత్ర రాజకీయం.. అధిష్టానం ఆదేశాలను లెక్కచేయని జిల్లా నేతలు

Rangareddy Congress: అధిష్టానం ఆదేశాలను పట్టించుకొని జిల్లా నేతలు
–అధికారంలోనున్న పట్టుసాధించని నేతలు
–పంచాయతీ ఎన్నికల ఫలితాలపై అసంతృప్తి
–మున్సిపాలిటీ ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహాం ఏమిటీ
–కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభావం వికారాబాద్​లోనే.. రంగారెడ్డిలో నామమాత్రమే
–రంగారెడ్డి జిల్లాలో పట్టుసాధించలేకపోతున్న కాంగ్రెస్​
–ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డితో పార్టీ కష్టం
–అధ్యక్షుడి ఎంపికలో జాప్యమేందుకు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: అధిష్టానం ఆదేశాలను మాత్రమే పాటించడం కాకుండా జిల్లాలో తమదైన శైలిలో పనిచేసి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులపై ఉంటుంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించే వారే అధ్యక్ష స్ధానంలో ఉండాలని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కేవలం అధిష్టానం ఇచ్చే పిలుపుతోనే కార్యక్రమాలు చేసి, మిగిలిన సమయాల్లో తమకేమీ తెలియదనట్లు వ్యవహారించే వ్యక్తులు అధ్యక్ష స్ధానానికి అర్హులు కాదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో కనిపిస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులను అధిష్టానం ప్రకటించింది.. కానీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి నియమాకంలో అధిస్టానం ఎందుకు జాప్యం చేస్తోందనే అనుమానాలున్నాయి. పార్టీకి విదేయుడిగా, క్రమశీక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్న చల్లా నర్సింహ్మారెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. కాంగ్రెస్(Congress) పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాలో చేపట్టి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, బహిరంగ సభలు, పాదయాత్రలు విజయవంతంగా చేశారు. కానీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయలేదనే వాధన బలంగా ఉంది. పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా చేపట్టడంలో ఆయనకు ఆయనే సాటి మరెవరు లేరు. జిల్లాలో షాద్​ననగర్​ నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerla Pally Shankar)​ పార్టీ అధ్యక్షుడితో కలిసి కార్యక్రమాలు చేయడంతో పాటు వ్యక్తిగతంగా పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేశారు. మిగిలిన నియోజకవర్గాల నేతల ఆశించిన స్ధాయిలో మద్దతు లేదని చెప్పక తప్పదు. జిల్లా అధ్యక్షుడు మెతక వైఖరీతోనే పార్టీ ప్రభావం లేదనే ప్రచారం జరుగుతుంది.

వీరి కృషితోనే ఎమ్మెల్యేలుగా గెలుపు..

రంగారెడ్డి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మూడు నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్(BRS)​ అభ్యర్ధులే గెలుపోందారు. అయితే గెలిచిన షాద్​ననగర్​, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల అభ్యర్థుల వ్యక్తిగతమేనని చెప్పాలి. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ప్రభావం లేదు. అధ్యక్షుడు సోంత నియోజకవర్గమైన మహేశ్వరంలోనే కాంగ్రెస్​ అభ్యర్ధి ఓడిపోవడం జరిగింది. కనీసం కాంగ్రెస్​ అభ్యర్ధి గెలుపు కోసం ప్రచారం చేసిన దాఖలాలు లేవు.. కేవలం అధ్యక్ష హోదాలో సభలకు, సమావేశలకు మాత్రమే హాజరైనట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇటీవల కాలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆశించిన స్ధాయిలో సర్పంచ్​ స్ధానాలు గెలిపించుకోలేకపోయారనే ఆరోపణలు స్వయంగా పార్టీ అధిష్టానమే సూచించింది.

అధికారంలో ఉండి ప్రయోజనం లేదా..

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ విఫలమైయ్యిందని చెప్పాల్సిందే. ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న షాద్​నగర్​, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో వాళ్ల అనుచరులు కాస్తో కూస్తో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ జిల్లా కాంగ్రెస్​ కార్యవర్గం మాత్రం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్రీయశీలక పాత్ర పోషించడం లేదని తెలుస్తోంది. పార్టీ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ వ్యవహార శైలిలో చాలా తేడా ఉంటుంది. జిల్లా అధ్యక్షుడు సలహాలు సూచనలు వినే పరిస్థితిలో ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కావడంతో పార్టీ అధికారంలోనున్న ప్రయోజనం లేకుండా పోయిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!

ఎమ్మెల్యేల నియోజకవర్గంలో అదే సీన్​..

ఎమ్మెల్యేలుగా గెలుపోందిన నేతలు వ్యక్తిగత ప్రభావంతో పాటు పార్టీ మద్దతు కలిసి వచ్చిందని చెప్పాల్సిందే. కానీ జిల్లా నాయకత్వంతోనే ఎమ్మెల్యేలుగా గెలుపోందారని చెబితే అది ఆవాస్తవం. ఎందుకంటే జిల్లాను ప్రభావితం చేసేంత నేత అధ్యక్షుడు కాదనే విషయం అందరికి తెలిసిందే. ఈ విషయం పక్కన పడితే పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో పెద్దగా గెలుపులు లేవని చెప్పాల్సిందే. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 75 పంచాయతీలుంటే కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ లు 32 మంది చొప్పున గెలిచారు. బీజేపీ 8, సీపీఎం 2, ఇతరులు 1 చోప్పున పంచాయతీలు గెలిపోందారు. బీఆర్ఎస్​తో కాంగ్రెస్​ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడినట్లు తెలుస్తోంది. కల్వకుర్తి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్, అమన్​గల్లు మండలాలున్నాయి. ఈ మండలాల్లో మాడ్గులలోనే అత్యధిక స్ధానాలు గెలిచి పార్టీ ప్రభావం చూపించింది. కానీ మిగిలిన తలకొండ, కడ్తాల్, అమన్గల్లులో కాంగ్రెస్​ కంటే బీఆర్ఎస్​ అత్యధిక గ్రామ పంచాయతీలను గెలిచింది. ఎమ్మెల్యే సోంత మండలం తలకొండపల్లిలో 32 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 10 పంచాయతీలు కాంగ్రెస్​ దక్కించుకుంది. మిగిలిన పంచాయతీల్లో బీఆర్​ఎస్​, హావా సాగించింది. షాద్​నగర్​ నియోజకవర్గంలో 153 గ్రామ పంచాయతీలుంటే 73 కాంగ్రెస్​, 65 బీఆర్ఎస్​, 15 ఇతరులు గెలిపోందారు. బీఆర్​ఎస్​ పై కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో హావా సాగించింది. కానీ ఎమ్మెల్యే సోంత మండలం నందిగామ పరిధిలో 19 గ్రామ పంచాయతీలుంటే కేవలం 6 పంచాయతీలను కాంగ్రెస్​, 12 బీఆర్ఎస్​ పార్టీ గెలిపోందాయి. చేవెళ్లలో 109 గ్రామ పంచాయతీలుంటే 52 పంచాయతీల్లో కాంగ్రెస్​ విజయం సాధించింది. అదే బీఆర్​ఎస్​ 39, బీజేపీ 9, ఇతరులు 9 చోప్పున పంచాయతీలు గెలిచారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే మండలం నవాబ్​పేట్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టలేదని తెలుస్తోంది. మహేశ్వరం, రాజేంద్రనగర్​ నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల్లో అంతంత మాత్రమే కాంగ్రెస్​ ఫలితాలు ఇచ్చింది.

వికారాబాద్​లో కాంగ్రెస్ జోరు.. 

వికారాబాద్​ జిల్లాలోని నాలుగు అసెంబ్లీల్లో కాంగ్రెస్​ విజయం సాధించింది. అదే తరహాలో పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపించారు. గతంలో పనిచేసిన జిల్లా అధ్యక్షుడు, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడుతో కలిసి ఎమ్మెల్యేలు సమన్వయంతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారనే సంకేతాలను అధిష్టానానికి ఇస్తున్నారు. పరిగి, తాండూర్​, కొడంగల్ నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా ఏకగ్రీవంగా చేసుకున్నారు. అన్నింటికంటే తాండూర్​ నియోజకవర్గం ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికలు సీరియస్గా తీసుకోని 30శాతం పైగా సర్పంచ్​లు ఎకగ్రీవం చేసుకొని అధిష్టానం మన్నులను పొందినట్లు తెలుస్తోంది. అదే తరహాలో పరిగి ఎమ్మెల్యే సైతం ప్రయాత్నం చేసి ఫలితాలు సాధించారు.

మున్సిపాలిటీల్లో సత్తా చాటేనా..!

కాంగ్రెస్​ అధిష్టానం పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలపై సిరీయస్ అయ్యింది. ఆశించిన స్ధాయిలో ఫలితాలు రాకపోవడంతో పార్టీ అధ్యక్షలపై అగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికలను సిరీయస్గా తీసుకోవాలని జిల్లా అధ్యక్షలకు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జీలకు వివరించింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో కష్టపడినట్లుగానే ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు మున్సిపాలిటీల్లో సత్తా చాటే అవకాశాలున్నాయి. కానీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంత మేర పనిచేస్తారనే విషయంపైనే అనుమానాలున్నాయి. కనీసం పార్టీ అధ్యక్షులు సోంత నియోజకవర్గంలో కూడా ప్రభావం లేకపోవడం గమనార్హం. మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రతి పట్టణం కచ్చితంగా కాంగ్రెస్​ కైవసం చేసుకునేందుకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించాలని పార్టీ వ్యవహారాల ఇంచార్జీ నటరాజన్​ మీనాక్షి జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Medaram Jatara: మేడారం వన దేవతల దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు.. ఒక్క రోజే ఎన్ని లక్షలంటే?

Just In

01

Gadwal Municipality: గద్వాల జిల్లా మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. చైర్ పర్సన్..?

Sanjay Dutt: ముంబై రోడ్లపై సంజయ్ దత్ ‘టెస్లా సైబర్‌ట్రక్’ హవా.. కిర్రాక్ ఎంట్రీ!

New District Demand: ప్రత్యేక జిల్లా సాధనకై గర్జించిన జేఏసీ.. భారీ ఎత్తున నినాదాలతో నిరహార దీక్ష..!

Intelligence Warning: మసూద్ అజర్ ఆడియో లీక్.. తెలంగాణ పోలీసులు అలర్ట్.. ఎందుకంటే?

Huzurabad Municipality: హుజురాబాద్ మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఖరారుతో.. కాక రేపుతున్న రాజకీయ వేడి..?