Medaram Jatara: మేడారం వన దేవతల దర్శనానికి భారీగా తరలి
Medaram Jatara ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Medaram Jatara: మేడారం వన దేవతల దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు.. ఒక్క రోజే ఎన్ని లక్షలంటే?

Medaram Jatara: సంక్రాంతి సెలవుల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు మేడారం (Medaram ) వెళ్లారు. వన దేవతలను దర్శించుకున్నారు. అయితే, ములుగు ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ ముందస్తు ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ నియంత్రణ కోసం యాక్సెస్ కంట్రోల్, క్యూలైన్ నిర్వహణ వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చేయడంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేసుకున్నారు.

Also Read: Medaram Jatara: మేడారం ఆలయానికి భారీగా పోటెత్తిన భక్తులు

అన్ని రూట్లలో ట్రాఫిక్ నిర్వహణ

మేడారానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నిర్వహణ కోసం 300 మందికిపైగా పోలీస్ సిబ్బందిని మోహరించారు. సరైన డైవర్షన్ ప్లాన్ అమలు చేయడంతో కొంత సేపే ట్రాఫిక్‌తో ఇబ్బంది కనిపించింది. మునుపటితో పోలిస్తే ఎక్కడా వాహనాల రద్దీ లేకుండా సజావుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం లేదు. బందోబస్తులో 600 మందికిపైగా పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. ములుగు ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ ఏటూరునాగారం మనన్ భట్, అదనపు ఎస్పీ ఏఆర్ సదానందం, డీఎస్పీ ములుగు రవీందర్, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ఏసీపీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

దగ్గరపడుతున్న జాతర

ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతరకు ఏర్పాట్లు చేశారు. ఈసారి 3 కోట్ల మంది వస్తారని అంచనా. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ముందుగానే భక్తులు వన దేవతలను దర్శించుకుంటున్నారు. శుక్రవారం ఒక్కరోజే 5 లక్షల మంది వచ్చినట్టు అంచనా.

Also Read: Maha Medaram Jatara: జనవరి 28 నుంచి మహా మేడారం జాతర.. జిల్లా ఎస్పీ కీలక పిలుపు

Just In

01

Vande Bharat 4.0: త్వరలో వందే భారత్ 4.0.. వేగం గంటకు 250 కి.మీ.. మరిన్ని ప్రత్యేకతలు ఇవే!

Municipal Reservations: మానుకోట మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఖరారు.. అత్యధిక స్థానాలు ఆ వర్గం వారికే..?

BJP Telangana: పార్టీ ఫిరాయింపు కేసులో కీలక పరిణామం.. స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన ఏలేటి!

Rayalaseema Project: రేవంత్ గిఫ్టు కోసం.. రాయ‌లసీమ లిఫ్టు తాక‌ట్టు.. చంద్రబాబుపై గోరంట్ల మాధ‌వ్‌ ఫైర్!

Medaram Jatara: మేడారం వన దేవతల దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు.. ఒక్క రోజే ఎన్ని లక్షలంటే?