FIR At Doorstep: బాధితుల ఇంటి దగ్గేర ఎఫ్ఐఆర్.. ఎస్పీ ప్రకటన
Suryapet district SP Narasimha announces doorstep FIR registration facility
రంగారెడ్డి, లేటెస్ట్ న్యూస్

FIR At Doorstep: ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్… సూర్యాపేట జిల్లా ఎస్పీ ప్రకటన.. కొత్తగా పోలీసింగ్

FIR At Doorstep: బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు

బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
మహిళా ఫిర్యాదులపై వెంటనే బాధితుల వద్దకే మహిళా పోలీస్ సిబ్బంది
పోలీస్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ ప్రకటన

సూర్యాపేట,స్వేచ్ఛ: ఫోన్ చేస్తే ఇంటికే పోలీసులు వచ్చి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు  చేసి భరోసా కల్పిస్తారు. అందుకోసం సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ కృషి చేస్తోంది. పోలీస్ స్టేషన్‌కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్న బాధితుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే బాధితుల వద్దకు వెళ్ళి ఫిర్యాదు స్వీకరిస్తారు. అక్కడే కేసు నమోదు (FIR At Doorstep) చేసి భరోసా కల్పిస్తామని జిల్లా ఎస్పీ  నరసింహ తెలిపారు. పోలీసు సేవల్లో పారదర్శకత కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అమలులోకి తెచ్చిన నూతన ప్రణాళిక కార్యాచరణను, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read Also- Allu Arjun: అల్లు అర్జున్ ‘AA23’లో పూజ హెగ్డే.. అలా వైకుంఠపురంలో రిపీట్ అవుతుందా..

ఈ ప్రణాళిక ప్రకారం ముఖ్యంగా శారీరక దాడులు గురయ్యే వారికి, ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు, బాలలకు, ర్యాగింగ్‌కు గురయ్యే విద్యార్థులకు, వేధింపులకు గురయ్యే మహిళలకు, బాలలకు ఎంతో సహాయపడనుందని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీని ప్రకారం, అన్ని పోలీసు స్టేషన్ల సిబ్బందికి, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించేందుకు మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టిందన్నారు. ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితులు తమ ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ ప్రణాళిక మేరకు పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్నవారి ఇంటికే పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read Also- Jogipet hospital: జోగిపేట ఆస్పత్రిలో డాక్టర్ల నిర్వాకం.. హెల్త్ కమిషనర్ తనిఖీలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, లేదా భద్రతా కారణాల వల్ల బయటకు రాలేని బాధితులకు ఈరకమైన సేవలు ఉపయోగపడతాయని అన్నారు. ఫోన్ కాల్‌, ఆన్‌లైన్ అభ్యర్థన లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది బాధితుల నివాసానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేస్తామని తెలిపినారు. ఈ విధానం ద్వారా ఫిర్యాదుల నమోదు ప్రక్రియ మరింత వేగవంతమవడంతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా శారీరక దాడులు, అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్ నిరోధక చట్టం, మైనర్ వేదింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు ఇది ఎంతో సహాయపడనుంది అన్నారు.

Just In

01

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ విచారణపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

FIR At Doorstep: ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్… సూర్యాపేట జిల్లా ఎస్పీ ప్రకటన.. కొత్తగా పోలీసింగ్

Rangareddy District: చనిపోయాడనుకొని మరచిపోయారు.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రత్యక్షం.. రంగారెడ్డిలో ఘటన

Ind vs NZ 1st T20: తొలి టీ20లో టీమిండియా విధ్వంసం.. కివీస్‌ ముందు భారీ టార్గెట్!

Municipal Politics: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు