Chevella News: గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాకు అవమానం జరిగిన ఘటన చేవెళ్ల మండల పరిధి రేగడి ఘనపూర్(Regadi Ghanapur)లో చోటు చేసుకుంది. స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని సరైన విధంగా ఎగరవేయకపోవడం, (ప్రోటోకాల్)ను పాటించకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశ గౌరవానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాల్సిన బాధ్యత వహించాల్సిన పాలకులు, అధికారులు తగిన శ్రద్ధ చూపలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామ సెక్రెటరీ(Village Secretary), సర్పంచ్(Sarpanch) పర్యవేక్షణ లోపమే ఈ పరిస్థితికి దారితీసిందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. జాతీయ పండుగ రోజున కూడా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Also Read: Minister Ponguleti: ఏదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చుదిద్దుతా: మంత్రి పొంగులేటి
పాచ్చనాయక్ తండాలో జాతీయ జెండాకు అవమానం
గణతంత్ర దినోత్సవం రోజునే చివ్వెంలా మండలంలోని పాచ్చనాయక్ తండాలో జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగింది. 77వ గణతంత్ర వేడుకల్లో భాగంగా అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన చేసిన అనంతరం జెండాను సరిగ్గా పైకి జరిపి జాగ్రత్తగా కట్టాల్సింది పోయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జాతీయ జెండా నేలపై పడిపోయింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాచ్చ తండా అంగన్వాడి కేంద్రంలో జెండాను అధికారులు గాలికి వదిలేయడంతో జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగిందని చర్చించుకున్నారు. జెండా ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే నేలపై పడిపోవడంతో అంగన్వాడి నిర్వాహకురాలు పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే ఘటన చోటు చేసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జెండాని గాలికి వదిలేసి నేలపై పడేలా చేసి అవమానం జరిగేలా చేసిన అంగన్వాడి బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ జెండాకు అవమానం కలిగించడం సరైన పద్ధతి కాదని ఎంతో జాగ్రత్తగా జెండాను ఆవిష్కరించడంతోపాటు అంతే పదిలంగా జెండాను పైకి తీసుకెళ్లి భద్రంగా రెపరెపలాడేలా చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామస్తులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Hyderabad Car Scam: రూ.26 వేలకే కారు.. ఎగబడ్డ జనం.. చివరికి ఊహించని మలుపు!

