Minister Seethaka: రాష్ట్ర ప్రభుత్వం మహిళాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Min Seethakka) అన్నారు. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రూ.26వేల కోట్ల రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో రూ.800 కోట్లు వడ్డి లేని రుణాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో మహిళా సంఘాలకు ప్రాధాన్యతనిస్తూ స్వయం ఉపాధి కోసం ప్రోత్సహిస్తున్నామన్నారు. 15 సంవత్సరాలు నిండిన మహిళాలకు సంఘంలో చోటు కల్పించామని, 60 యేండ్లు దాటిన మహిళాలను కూడ కొనసాగిస్తున్నామని వివరించారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే కాలే యాదయ్య(MLA Kale Yadav) ఆధ్వర్యంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి(MLA Patnam Mahender Reddy)లు ప్రారంభోత్సవాలు, శంఘుస్థాపనలను చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలు
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు రుణాలు పొంది మరణించినట్లయితే రూ.2 లక్షల లోన్ బీమా చేయించడం జరుగుతుందని అన్నారు. మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయని గుర్తు చేశారు. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి పేదవాడు సన్న బియ్యంతో భోజనం చేయాలన్న సదుద్దేశంతో సన్న బియ్యాన్ని అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు.
Also Read: Mahabubabad district: వానొస్తే 11 గ్రామాల రాకపోకలు బంద్.. ఈ సారైనా గోస తీరేనా..?
రైతులు సన్న వడ్లు పండించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500ల బోనస్ ఇస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆరోగ్యశ్రీ కింద వైద్యానికి రూ.5లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచిన చరిత్ర కాంగ్రెస్(Congress) ప్రభుత్వానిదేనని అన్నారు. అత్యంత వెనుకబడిన చించలపేట గ్రామంలో పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సంతోషానిస్తుందని ఎస్సీ(SC), ఎస్టీ(ST) , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adlure laxman Kumar) అన్నారు.
ఇచ్చిన మాట కట్టుబడి
వికారాబాద్ జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట్ మండలంలోని చించల్ పేట్ గ్రామంలో రూ.15 లక్షలతో అంగన్వాడి భవనం, రూ.20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్(BC Community Hall), రూ.20 లక్షలతో పశు వైద్య ఉపకేంద్ర భవనం, రూ.20 లక్షలతో డ్వాక్రా భవనం, రూ.30లక్షలతో ఎస్సీ(SC) కమ్యూనిటీ హాల్, రూ.20 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనం, రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు అందిపుచ్చుకోవాలన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని ఆయన అన్నారు. గ్రామాల కనీస అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ నిధులను కేటాయించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్డిఓ వాసు చంద్ర, డిఆర్డిఎ పీడీ శ్రీనివాస్, డిపిఓ జయసుధ, డిటిడబ్ల్యుఓ కమలాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి రాజరత్నం, పశుసంవర్ధక శాఖ అధికారి సదానందం, డిడబ్ల్యుఓ కృష్ణ వేణి, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఇఇ ఉమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: BJP MLAs Arguments: అసెంబ్లీలో గొడవ పడ్డ అధికార ఎమ్మెల్యేలు.. నచ్చజెప్పిన విపక్ష సభ్యులు!