Rangareddy District: చనిపోయాడనుకుంటే 8 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం
Man reunites with his family after eight years at Matru Devobhava orphanage in Rangareddy district
రంగారెడ్డి, లేటెస్ట్ న్యూస్

Rangareddy District: చనిపోయాడనుకొని మరచిపోయారు.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రత్యక్షం.. రంగారెడ్డిలో ఘటన

Rangareddy District: మాతృదేవోభవ అనాథ ఆశ్రమం నిర్వహాకులు కుటుంబ సభ్యులకు అప్పగింత

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: చనిపోయాడనుకొని మర్చిపోయిన ఓ వ్యక్తి.. ఏకంగా ఎనిమిదేండ్ల తర్వాత బ్రతికే ఉన్నాడనే సమాచారం  కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని తెలుసుకొని, వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. భావోద్వేగకరమైన ఈ ఘటన (Viral News) రంగారెడ్డి జిల్లా (Rangareddy District) నాదర్గుల్ గ్రామం, బాలాపూర్​ మండలం పరిధిలోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో జరిగింది. ఎంతోమంది పేదలను అక్కున చేర్చుకొని మానసిక రుగ్మతలను తొలగించి కుటుంబ సభ్యుల వద్దకు పంపిస్తున్న ఘటనలు అనేకం జరిగాయి. అనాథ ఆశ్రమం నిర్వహకులు గట్టు గిరి.. రహదారులపై నిరాశ్రయులను ఆశ్రమానికి తీసుకొచ్చి సాధారణ స్థితికి వచ్చేలా  తీర్చిదిద్దుతున్నారు. కొత్త జీవనం ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వ్యక్తులే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను సైతం ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తున్నారు.

Read Also- Municipal Politics: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు

అదేరీతిలో మహారాష్ట్రలోని హవేలీ తాలూకా, కుంజిర్​ వాడికి చెందిన నారాయణ్ గులాబ్​ కల్బోర్​ అనే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి ఎనిమిదేండ్ల కింద ఇంటిని వదిలి వెళ్లాడు. పెరిగిన గడ్డం, జుట్టు , మాసిన దుస్తులతో సికింద్రాబాద్​ ప్రాంతంలో తిరుగుతూ ఉండేవాడు. 4 సంవత్సరాల క్రితం మాతృదేవోభవ అనాథ ఆశ్రమానికి స్ధానికులు సమాచారం అందించారు. దాంతో ఆశ్రమం ఆశ్రయం కల్పించి మతిస్థిమితం నుంచి కోలుకున్నాక.. అతడి చిరునామా చెప్పేందుకు నిరాకరించేవాడు. ఏలాగైన సరే అతడి చిరునామా తెలుసుకోని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని గట్టు గిరి తపనపడ్డారు.

ఆ నేపథ్యంలో కొత్త ఆధార్​ నమోదు కోసం ఫింగర్​ ఫ్రింట్స్​ కంప్యూటర్​ సేకరిస్తున్న సమయంలో ఆధార్ అప్పటికే ఉన్నట్టు బయటపడింది. అమీర్‌పేట్‌లోని ఆధార్​ హెడ్ ఆఫీస్ వద్దకు వెళ్లి అడ్రస్​తో పాటు ఫోన్​ నెంబర్​ గట్టు గిరి కనుక్కున్నారు. దాంతో వాళ్ల కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. తండ్రి బతికే ఉన్నాడనే సమాచారం తెలుసుకున్న కొడుకులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఫోన్‌లోనే కన్నీళ్లు  పెట్టుకున్నారు. తమ తండ్రి చనిపోయాడనీ అనుకున్నామని, మళ్లీ చూస్తామని అనుకోలేదని కన్నీటిపర్యంతమవుతూ మాట్లాడారు. స్థానిక ఎస్​ఐ వెంకటేశ్​ సమక్షంలో కొడుకులు యోగేష్​ నారాయణ్, జీవన్​ నారాయణ్‌లకు తండ్రిని మాతృదేవోభవ ఆశ్రమ నిర్వహకులు గట్టు గిరి అప్పగించారు.

Read Also- Municipal Elections: మునిసిపల్ ఎన్నికల ముందు నాగర్ కర్నూల్‌లో బీఆర్ఎస్ పార్టీకి షాక్

Just In

01

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ విచారణపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

FIR At Doorstep: ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్… సూర్యాపేట జిల్లా ఎస్పీ ప్రకటన.. కొత్తగా పోలీసింగ్

Rangareddy District: చనిపోయాడనుకొని మరచిపోయారు.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రత్యక్షం.. రంగారెడ్డిలో ఘటన

Ind vs NZ 1st T20: తొలి టీ20లో టీమిండియా విధ్వంసం.. కివీస్‌ ముందు భారీ టార్గెట్!

Municipal Politics: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు