Kavitha Criticises KTR: సికింద్రాబాద్‌ను ప్రత్యేక జిల్లా చేయాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రదర్శిస్తున్న వైఖరిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha Criticises KTR) తప్పుబట్టారు. కేటీఆర్‌పై (KTR) ఆమె విమర్శలు గుప్పించారు. ‘‘నిన్నా, మొన్నా నవ్వొచ్చింది నాకు. కేటీఆర్ వెళ్లి సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు. గత పదేళ్లలో సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలని అడిగినవాళ్లను అణిచివేశారు. జైళ్లలో వేసిన విషయాన్ని విస్మరించారు. ఈరోజు కొత్తగా వెళ్లి సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలని కేటీఆర్ మాట్లాడుతున్నారు’’ అని కవిత అన్నారు.
కవితపై బీఆర్ఎస్ కార్యకర్తల గుస్సా
కేటీఆర్‌ను విమర్శిస్తూ కవిత చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వార్తల్లో నిలవడానికి ఇదొక మంచి వ్యూహమని, కాంగ్రెస్‌ను విమర్శిస్తే ఎవరూ పట్టించుకోరు, కానీ, బీఆర్ఎస్‌ను విమర్శిస్తే అన్ని ప్రసార మాధ్యమాలు కవర్ చేస్తాయి, అందుకే కవిత ఈ విధంగా మాట్లాడుతున్నారని ఒక కామెంట్ చేశారు. ‘‘లిక్కర్ దందా ఏమైంది అక్కా?. నడవడం లేదా?. లేదా, బీజేపీతో కలిశాక లిక్కర్ కాస్త నీళ్లుగా మారిపోయిందా? అని ఓ విమర్శించారు. ఈమెకు పనిపాట ఏమీ లేదని, గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాంగ్రెస్‌లో మినిస్టర్ ఎప్పుడు అవుతున్నారు? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దయచేసి టీడీపీలో చేరండని ఒకరు కామెంట్ చేశారు. ‘‘ఏంటి మేడమ్ మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు’’ అని ఒకరు రాసుకొచ్చారు. ‘నిన్న, మొన్నటి వరకు అదే పార్టీలో ఉన్నావ్ కదా?’ అని ప్రశ్నించారు. మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘మా ఇంటిని కూడా జిల్లాగా ప్రకటించండి’’ అని కామెంట్ చేశారు. ‘‘అక్కా మీరు సాంస్కృతిక శాఖా మంత్రి కావాలి’’ అని విమర్శించారు.
Read Also- Ustaad BhagatSingh: పవన్ కోసం తన కలానికి మరింత పదును పెడుతున్న చంద్రబోస్.. ఇది వేరే లెవెల్..
కాగా, సికింద్రాబాద్ జిల్లా డిమాండ్‌ను బీఆర్ఎస్ తెరపైకి తీసుకొచ్చింది. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సోయి లేకుండా ప్రవర్తించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్‌పై కవిత చేసిన విమర్శలు బీఆర్ఎస్‌లో అంతర్గతంగా చర్చకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read Also- Mega 158: మెగా158లో కూతురు పాత్ర కోసం పోటీపడుతున్న ట్రెండీ హీరోయిన్స్.. ఎవరంటే?

