Mega 158: మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ టాలీవుడ్ రికార్డుల బ్రేక్ చేసింది. 2026లో సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం మెగాస్టార్ ఈ హిట్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత బాబి కొల్లి దర్శకత్వంలో మెగా 158 సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ కూతురుగా చేసేందుకు ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఇద్దరు హీరోయిన్లను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు ఉప్పెన ఫేమ్ హీరోయిన్ కీర్తి శెట్టి కాగా, మరోకరు ఛాంపియన్ ఫేమ్ అనస్వరా రాజన్. వీరిద్దరిలో ఒకరిని చిరంజీవికి కూతురుగా చేసేందుకు సెలక్స్ చేయనున్నారు. అయితే ఈ లక్కీ ఛాన్స్ మాత్రం ఎక్కువ శాతం కీర్తి శెట్టి వైపే ఉంది. మూవీ టీం కీర్తి వైపే మొగ్గు చూపిస్తున్నారని సమాచారం. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే మంచి జోష్ మీద ఉన్న మెగాస్టార్ ఈ సినిమాను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Read also-Sonu Sood Praises Pawan: డిప్యూటీ సీఎం పవన్‌పై సోనూసూద్ పొగడ్తలు.. వీడియో ఇదిగో
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబి (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో వస్తున్న మెగా 158 గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా ఒక బలమైన “కూతురు సెంటిమెంట్’ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ఈ కథకు ప్రధాన బలమని తెలుస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 2026 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమాను 2026 చివరలో లేదా 2027 సంక్రాంతి బరిలో దించే ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు. బాబి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాతో మరో హ్యాట్రిక్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు.
Read also-Nidhhi Agerwal: ఆయన పీఎం అయినా ఆశ్చర్యపడను.. నిధి అగర్వాల్.. ఎందుకంటే?

