Land Scam: ధరణి, భూ భారతితో సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని పట్టాదారులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నేతలు, కబ్జాదారులకు ఉన్న ప్రాధాన్యత రైతులకు, నిజమైన లబ్ధిదారులకు లేదనే ప్రచారం సాగుతుంది. ప్రభుత్వ ఆధీనంలో ప్రజప్రయోజనాలకు అవసరమైన భూమి లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతుంది. కానీ అదే భూమిని కబ్జా చేసేందుకు రియల్ వ్యాపారులు, రాజకీయ నేతలు అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. రెవెన్యూ(Revenue) అధికారుల అండదండలతో ఖాళీ స్థలం కనిపిస్తే తమ ఖాతాలో వేసుకోవాలనే ఆలోచనతో రాజకీయ నేతలు నిత్యం ఆలోచిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో అధికారులను ప్రభావితం చేస్తే సరిపోతుందనే ప్రచారం జిల్లాలో ఉంది. అందుకు అనుగుణంగా బడా వ్యాపారుల యాజమాన్యులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలే లక్ష్యంగా రియల్ ఏస్టేట్(Real estate) నడిపిస్తున్నారు. రియల్ మాఫీయాలో సామాన్య ప్రజలు బలైపోతున్న సందర్భాలున్నాయి.
రికార్డులో లేని విస్తీర్ణం…
జేబీ ఇన్ఫ్రా(JB Infra) చేపడుతున్న లేఅవుట్లో భూ సమస్యలున్నాయి. కోర్టు కేసులతో వివాదమైతున్న భూములే లక్ష్యంగా రియల్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా రికార్డుల్లోనున్న భూ విస్తీర్ణంతో పనిలేకుండా పోజిషన్లోనున్న విస్తీర్ణం మొత్తం తమ ఖాతాలోకి వచ్చేటట్లు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అయితే రంగారెడ్డి(Rangareddy) జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూర్ గ్రామంలోని 371, 372, 374, 377 సర్వే నెంబర్లో సుమారుగా 55 ఎకరాల భూమిలో జేపీ ఇన్ఫ్రా నిర్మాణాలు చేపట్టేందుకు సిద్దమైయ్యింది. అందుకు అనుమతి తీసుకోకుండా అధికార బలంతో ఇష్టానుసారంగా వినియోగదారులను బురడి కొట్టించేందుకు చర్యలు తీసుకుంటుందనే ఆరోపణలున్నాయి. కోర్టు పరిధిలోనున్న సీమాంధ్ర వాళ్ల భూమిని కావాలనే జేబీ ఇన్ఫ్రా యాజమాన్యం తీసుకుంది. ఈ భూమి పక్కనే రికార్డులోకి రాని భూమి ఉండటమే ఇందుకు కారణమని ప్రచారం సాగుతుంది. కోట్ల విలువైన భూములను కాజేసేందుకు ఇష్టానుసారంగా రియల్ మాఫీయా ప్లాట్లు చేసి వినియోగదారులకు అంటగట్టే ప్రయాత్నం చేస్తున్నారు. ధరణి ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంత భూమిపై జేబీ ఇన్ఫ్రా కన్నెసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కూడా అధికారంతో రికార్డులను తారుమారు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారుగా 20 ఎకరాలపై విస్తీర్ణం రికార్డుల్లో లేదు. ఈ భూమిని తమ ఖాతాలో జమ చేసుకున్నట్లు స్ధానికులు గుసగుసలాడుతున్నారు. ఈ భూమి కోసమే ఆరాట పడుతున్నట్లు తెలుస్తోంది.
రికార్డులపై విచారణ చేస్తే బహిర్గతం
తుమ్మలూర్(Thummalur) గ్రామంలోని సర్వే నెంబర్ 377లో భూమి రికార్డుల్లోకి ఏలా వచ్చింది. వాస్తవంగా ఈ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది. ప్రస్తుత భూ భారతిలో ఉన్న భూమికి పోంతన లేదని తెలుస్తోంది. 377 సర్వే నెంబర్లో సేత్వార్, ఖాస్రా రికార్డులతో పోలిస్తే అత్యధికంగా భూ భారతిలో ఉందని తెలుస్తోంది. ఈ భూ రికార్డులపై విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేస్తున్నారు. జేబీ ఇన్ఫ్రా చేసే అవకతవకలపై బాధితులు పెద్ద ఎత్తున్న ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చుకోవడం, మరోవైపు వివాద స్థలాలను కొనుగోలు చేసి రైతులను ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది.ఇలాంటి భూముల్లో విల్లాలు నిర్వహిస్తున్నట్లు జోరుగా ప్లేక్స్లు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈవెంచర్కు హెచ్ఎండీఏ(HMDA) అధికారులు ఇప్పటి వరకు అనుమతి కూడా ఇవ్వలేదు. కానీ వినియోగదారులను నిండా ముంచేందుకు జేబీ ఇన్ఫ్రా సిద్దమైనట్లు తెలుస్తోంది.
Also Read: Bigg Boss 9 Telugu: భరణీని చిక్కుల్లో పడేసిన తనూజ.. డీమాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఓడిపోయాడా?..

