Rangareddy District (imagecredit:swetcha)
రంగారెడ్డి

Rangareddy District: దళితుల భూ సమస్య.. తప్పుడు సర్వేనంబర్‌తో అగ్రిమెంట్లు

Rangareddy District: రంగారెడ్డి జిల్లా కొంగరకుర్థు దళిత రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. తుక్కుగూడలోని కాంగ్రెస్ కార్యాలయంలో దళిత కుటుంబాలు కెఎల్ఆర్ కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.

సర్వేనంబర్ 73లో 43 ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు 7 దశాబ్ధాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే 2009లో హౌసింగ్ బోర్డుకు ఈ భూమిని కేటాయించారని, ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకునేందుకు రావటంతో రైతులు అవాక్కైయ్యారు.

తప్పుడు సర్వేనంబర్‌తో అగ్రిమెంట్లు

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమకు ఇచ్చే పరిహారం చెప్పకుండా భూమిని తీసుకోవద్దంటూ కేఎల్ఆర్‌కు రైతులు, మహిళలు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తప్పుడు సర్వేనంబర్‌తో అగ్రిమెంట్లు చేసుకోవటం జరిగిందని, తమకు సంబంధం లేదని కేఎల్ఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ సమస్యపై కేఎల్ఆర్ వెంటనే ఆర్డీవోతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నారు. కొంగరకుర్థు రైతుల సమస్యను ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేఎల్ఆర్ హామీ ఇచ్చారు.

Also Read: Panchayat Raj Director: పల్లెల్లో పకడ్బందీగా.. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి!

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్