Panchayat Raj Director( image credit: twitter)
తెలంగాణ

Panchayat Raj Director: పల్లెల్లో పకడ్బందీగా.. పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి!

Panchayat Raj Director: వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పంచాయతీరాజ్(Panchayat Raj)  అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్​,(Panchayat Raj) గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్​ సృజన(Srujana) ఆదేశించారు. జడ్పీ సీఈవోలు, డీపీవోలకు ఉత్తర్వులు జారీ చేశారు. దోమలతో మలేరియా, డెంగ్యూ, చికెన్​ గున్యాతో పాటు సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 Also Read: Ranga Reddy District: పోస్టులు ఖాళీగా ఉండడంతో.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు!

పల్లెల్లో పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని, ఎప్పటికప్పుడు మురుగు, చెత్త చెదారం తొలగించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. గృహ పరిసర ప్రాంతాలు, రోడ్లుపై(Road)  చెత్త చెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. మురుగు కాల్వలు, గుంతల్లో తప్పకుండా బ్లీచింగ్ పౌడర్‌ను చెల్లించాలని కోరారు. ప్రజలు నీటిని వేడిచేసి చల్లార్చి తాగాలని, దీనిపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో దండోరా వేయించాలని, సదస్సులు నిర్వహించాలని కోరారు.

పబ్లిక్ నల్లాలు, చేతి పంపుల దగ్గర అపరిశుభ్రత, నీరు నిల్వ లేకుండా చూడాలని పేర్కొన్నారు. నివాస ప్రాంతాల్లో ఖాళీ డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పల్లో నీరు నిల్వ లేకుండా పొడిగా ఉండేలా వారానికి ఒక రోజు “డ్రై డే” నిర్వహించాలని సూచించారు. పల్లెల్లో ప్రతిరోజూ సాయంత్రం ఫాగింగ్ చేయాలని చెప్పారు తాగునీటి వనరులు, ట్యాంకులను క్లోరినేషన్ చేయాలన్నారు. గ్రామాల్లో వర్షాకాలంలో చేపడుతున్న చర్యలపై డీపీవోలు, డీఎల్​పీవోలు, ఎంపీడీఓలో పంచాయతీ కార్యదర్శుల ఫార్మామెన్స్​ మాడ్యూల్​ నమోదు చేసిన వివరాలను పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 Also Read: GHMC and HMDA: గ్రేటర్‌లో 24 లక్షల.. మొక్కలు నాటడమే లక్ష్యం!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!