Swetcha Effect (IMAGE CREDIT: SWETCHA REORTER)
రంగారెడ్డి

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్​.. నర్సింగ్​ స్కూల్స్​ దందాపై విచారణ.. తనిఖీలకు ఆదేశించిన డీఎంఈ

Swetcha Effect: విద్యా అనేది పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. పుట్టగోడుగుల్లాగా విస్తరిస్తున్న పట్టించుకోని సంబంధిత అధికారులు. కాలేజీలు, స్కూల్స్​ అనుమతి పోందినప్పటికి ఎక్కడ నిర్వహిస్తున్నారో తెలియని దమనీయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మొన్నటి వరకు ఎడ్యూకేషన్​ ఆఫ్​ స్కూల్స్​ పైన మాత్రమే ఆరోపణలుండేవి. ప్రైవేట్​, కార్పారేట్​ స్కూల్స్​, కాలేజీలు మాత్రమే ఇష్టానుసారంగా నడిపిస్తున్నారనే భావన బలంగా ఉండేంది. డైరెక్టర్​ ఆఫ్​ మెడికల్​ ఎడ్యూకేషన్​ అధీనంలో ఉండే నర్సింగ్ కౌన్సిల్​ రిజిస్ట్రార్​, సిబ్బంది నిర్లక్ష్యంతో విచ్చలవిడిగా నర్సింగ్​ స్కూల్స్​కు అనుమతులిచ్చారు. ​ కానీ ఆ నర్సింగ్​ స్కూల్స్ నిర్వహాణపై ఉన్నతాధికారులు చూసిచూడనట్లు వ్యవహారించారు. దీంతో అనుమతి పొందిన నర్సింగ్​ స్కూల్స్​ యాజమాన్యం ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్దంగా నడిపించడం గమనార్హం.

Also Read: Kunamneni Sambasiva Rao: బీసీ రిజర్వేషన్ల అంశంలో దోషి బీజేపీనే.. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు

ఈ కథనంపై స్పందించిన డీఎంఈ డాక్టర్​ నరేందర్​ కుమార్

అంతేకాకుండా ఆ స్కూల్స్​లో విద్యార్ధుల సంఖ్య, హాస్టల్​ వసతితో పాటు నిర్వహిస్తున్న ప్రాంత వివరాలను గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలకు తావునిచ్చింది. అనుమతి తీసుకున్న ప్రాంతంలో నర్సింగ్​ స్కూల్స్​ నడిపించకుండా ఇతర ప్రాంతాలల్లో బోర్డులు పెట్టి వ్యవహారిస్తున్నారు. ఈవిషయాలపై క్రైస్తవ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు మాసారం ప్రేమ్​ కుమార్​ ఆధారాలతో సెప్టెంబర్​ నెలలో డీఎంఈకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు వివరాలతో సెప్టెంబర్​ 9వ తేదీన స్వేచ్ఛ దినపత్రికలో నర్సింగ్​ స్కూల్స్​లో దందా అనే కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన డీఎంఈ డాక్టర్​ నరేందర్​ కుమార్ ఆ స్కూల్స్​పై విచారణ చేయాలని​ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాలతో అధికారులు ఇప్పటికే తనిఖీల కోసం టీమ్​లను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ​

ఇప్పటికే కొన్ని స్కూల్స్​పై తనిఖీలు

అక్రమంగా నడిపిస్తున్న నర్సింగ్​ స్కూల్స్​లను అధికారులు గుర్తించారు. శుక్రవారం నుంచి తనిఖీలు ప్రారంభించానట్లు తెలుస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోనున్న కొన్ని నర్సింగ్​ స్కూల్స్​లను తనిఖీ చేసినట్లు సమాచారం. అయితే గత పదిహేను రోజులుగా నర్సింగ్​ స్కూల్స్​ యాజమాన్యం డైరెక్టర్​ ఆఫ్​ మెడికల్​ ఎడ్యూకేషన్​ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ యాజమాన్యం చేసిన రాయబారం ఫలించకపోవడంతో అధికారులు తనిఖీలకు శ్రీకారం చూట్టినట్లు సమాచారం. రాష్ట్రంలోనున్న ప్రతి నర్సింగ్​ స్కూల్స్​ను తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేధికలు పంపనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. మొదటగా ఫిర్యాదు అందిన 23 నర్సింగ్​ స్కూల్స్​పై వారం రోజుల్లో రిపోర్ట్​ ఇచ్చేందుకు అధికారులు సిద్దమైనట్లు తెలిపారు.

తనిఖీలకే పరిమితమా

నర్సింగ్ స్కూల్స్ నిబంధనలు ఉల్లంఘించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ , నర్సింగ్ కౌన్సిల్ నుండి గుర్తింపు తీసుకున్న అడ్రస్లో కాకుండా పూర్తిగా ఇతర ప్రాంతాల్లో నడిపించడం విడ్డురంగా ఉంది. ఈ వ్యవహారం ఇటీవల కాలంలో నడుస్తున్న దందా కాదు. గత ఏడు యేండ్లుగా సాగుతున్న తతంగం. 2025లో 35 నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్కు అనుమతులు ఇచ్చారు. అవి ఏ అడ్రస్ లో ఉన్నాయో , వాటి యొక్క భవనాలు ఎక్కడ ఉన్నాయో అధికారులకే తెలియదు. రాష్ట్రంలో 200లకు పైగా నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోనే 68 స్కూల్స్ ఉండటం గమనర్హం.

కేవలం తనిఖీలతో వదిలేసి చేతులు దులుపుకుంటారా? 

వీటికి అనుమతిని ఇచ్చేది డైరెక్టర్ అఫ్ మెడికల్ ఏడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ ఈ స్కూల్స్ నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే విషయాలను పరిశీలించాల్సింది నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్. అయితే ఈ రిజిస్ట్రార్ ఓకే చోట 8యేండ్లుగా పని చేయడంతో నర్సింగ్ స్కూల్స్ యాజమాన్యంతో మంచి సంబంధలున్నాయని ప్రచారం సాగుతుంది. అంతే కాకుండా ప్రభుత్వాలు మారిన ఆ అధికారి అదే చెర్లో యేండ్లుగా కొనసాగడం వారి ప్రత్యేకత. ప్రతి ప్రవైట్ నర్సింగ్ స్కూల్స్ నుంచి ఏడాదికి రూ.2లక్షల నుంచి రూ.4లక్షలు కప్పం కట్టాలని ఆ అధికారి ఆదేశమనే చర్చ కూడా సాగుతుంది. అయితే కేవలం తనిఖీలతో వదిలేసి చేతులు దులుపుకుంటారా అనే అనుమానాలున్నాయి. విచారణ పూర్తైన తర్వాత ఆ అక్రమాలను ప్రోత్సహించిన సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటారా వదిలేస్తారా వేచిచూడాల్సి ఉంది.

Also Read:Fee Reimbursement: సర్కార్ చర్చలు సఫలం.. కాలేజీలకు రైట్ రైట్

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?