Kunamneni Sambasiva Rao: అసెంబ్లీలో బీజేపీ, బీఆర్ఎస్ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపి ఇప్పుడు సన్నాయి నొక్కులు ఎందుకు అని సీపీఐ రాష్ట్రకార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీలోని ప్రధానమంత్రి, రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలోని జంతర్ వద్ద ధర్నా నిర్వహించాలన్నారు. బీసీ రిజర్వేషన్లలో కేంద్రంలోని బీజేపీదే పూర్తి బాధ్యత అన్నారు. హైదరాబాద్ మఖ్దూంభవన్ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Also Read: Kunamneni Sambasiva Rao: ప్రజాస్వామ్యానికి పునాదులు అవే.. సీపీఐ నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు
రాజకీయ పార్టీలు చిత్ర విచిత్రం
బీసీల రిజర్వేషన్ల నేరం బీజేపీదేనని, దీనికి తగిన మూల్యాన్ని ఆ పార్టీ చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. ఈ నేరానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బీఆర్ మద్దతునిస్తుందని, ఇందుకు ఆ రెండు పార్టీలే బాధ్యత వహించాలన్నారు. రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీలు చిత్ర విచిత్రంగా వ్యవహారిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం విచారకరమని, కోట్లాది మంది ఆవేదనను, బాధను, ఆకాంక్షలను పరిగణలోకి తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ వద్ద మూడు నెలలుగా బిల్లులు పెండింగ్ ఉంటే, వాటిని నోటిఫై చేసిన్టనని తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించేల చేయాలి
రిజర్వేషన్ల విషయంలో కోర్టు ఆరు వారాలు స్టే విధించడం ‘అటు ఇటు’ కాకుండా ఉన్నదని, ఇందులో ఏదో మతలబు ఉన్నదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ కూడా పేద ప్రజలను పరిహాసం చేస్తోందన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని న్యాయవ్యవస్థ పునర్ పరిశీలించాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు విధించిన స్టే బీసీల హక్కులకు తీవ్ర విఘాతం అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్లులను గవర్నర్ ఆమోదించేలా చేసేవారన్నారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి నర్సింహ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.
Also Read: CPI Narayana: బీజేపీ – బీఆర్ఎస్ మధ్య సంబంధం ఉంది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
