Jishnu Dev: రాష్ట్రంలో టీబీ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) అన్నారు. అనంతగిరి హిల్స్ రిసార్ట్స్‌లో ట్యూబర్ క్యూలోసిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(Tuberculosis Association of Telangana in resorts) ఆద్వర్యంలో కాన్పోరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ హాజరై ప్రసంగించారు. టీబీ(TB) రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నివారణ కోసం ప్రస్తుత మార్కెట్లోకి అనేక రకాల మందులు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ ట్యూబర్ క్యూలోసిస్(Tuberculosis), చెస్ట్ డిసిసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ఫరెన్స్-2025 శుభపరిణామం అన్నారు.
వికారాబాద్ జిల్లాను రోల్ మాడల్ గా
ఇలాంటి కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, పద్మశ్రీ అవార్డు పోందిన వారు, రచయితలను భాగస్వామ్యం చేయాలన్నారు. సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్లో టి బి నిర్మూలనకు అందరు కష్ట పడితేనే అందరు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి, దేశానికి అన్ని జిల్లాల కంటే వికారాబాద్ జిల్లాను రోల్ మాడల్ గా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలంగాణా టిబి చెస్ట్ డిసీసేస్ కాన్ఫరెన్స్(Telangana TB Chest Diseases Conference) సందర్భంగా ఆదేశించారు. టి బి(TB) లక్షణాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిపించాలని అన్నారు. టి బి ముక్త్ భరత్ కోసం ప్రతి ఒక్కరు బాద్యతగా వ్యవహరించాలన్నారు. వికారాబాద్ జిల్లాకు స్పీకర్, ఏంపి ఉండటం జిల్లా అదృష్టమన్నారు.
Also Read: Hyderabad Rains:హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. 4 రోజులపాటు అలర్ట్!
గవర్నర్ ప్రశంశా పత్రాలు
టిబి నిర్మూలనలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని సూచించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ జిల్లా టీబీ అధికారులైన డాక్టర్ మల్లికార్జున9DR.Malilikarjuna), డాక్టర్ రాజు(DR, Raju), డాక్టర్ సుమలత(DR. Sumalatha), డాక్టర్ పుల్లరెడ్డి(Dr. Pullareddy)లకు గవర్నర్ ప్రశంశా పత్రాలు, గోల్డ్ మెడల్(Gold Medal) ,మేమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్(MLa Gadam Prasad Kumar), చేవెళ్ళ ఎంపీ డా విశ్వేశ్వర్ రెడ్డి(MP Dr. Vishweshwar Reddy), ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిషోర్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్ పి నారాయణ రెడ్డి, టిబి అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ సుదీర్ ప్రసాద్,దీన దయాళ్ బాగ్ , డాక్టర్ నరేందర్, బాల చందర్, డాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.
Also Read: The Day of The Triffids: మానవాళిపై మొక్కల దాడి .. ఆ మాయా ప్రపంచం చూడాలంటే..
