web-series(image :X)
ఎంటర్‌టైన్మెంట్

The Day of The Triffids: మానవాళిపై మొక్కల దాడి .. ఆ మాయా ప్రపంచం చూడాలంటే..

The Day of The Triffids: ఒకప్పుడు ఎంటర్‌టైన్మెంట్ అంటే సినిమా థియేటర్లకు వెళ్లేవారు. ప్రస్తుంతం రజుల్లో అది అరచేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు అంతా.. ఓటీటీ వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో వెబ్ సిరీస్ లు సందడి చేస్తున్నాయి. కంటెంట్ కొంచెం నచ్చినా వదలకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొక్కలు మానవులపై దాడి చేస్తే ఎలా ఉంటుందో అనేది. ట్రిఫిడ్స్ అనే మాంసాహారి మొక్కలు మానవులపై దాడి చేస్తుంటాయి. వీటినుంచి మానవాళి ఎలా బయటపడుతుందనేదే ఈ స్టోరీ. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

Read also-Manda Krishna Madiga: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శలు

స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘ది డే ఆఫ్ ది ట్రిఫిడ్స్’ (The Day of the Triffids) రిచర్డ్ మ్యూస్ సృష్టించిన BBC టీవీ మినీ-సిరీస్. ఇందులో డౌగ్రే స్కాట్ (బిల్ మాసెన్), జోలీ రిచర్డ్‌సన్ (జో ప్లేటన్), ఎడ్డీ ఇజ్జార్డ్ (టొరెన్స్) నటించారు. ఇది 2009 డిసెంబర్ 28, BBCలో రిలీజ్ అయింది. ఇప్పుడు Amazon Prime Videoలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సిరీస్ BAFTA అవార్డ్‌ను కూడా గెలుచుకుంది. 3 గంటల రన్‌టైమ్ (2 ఎపిసోడ్స్)తో నడుస్తోంది.

స్టోరీ ఏంటంటే..?

బిల్ మాసెన్ ట్రిఫిడ్స్ అనే బయో-ఇంజనీర్ మాంసాహార మొక్కలపై పరిశోధన చేసే శాస్త్రవేత్త. ఒక ట్రిఫిడ్ దాడిలో గాయపడి, కళ్లకు బ్యాండేజ్‌తో ఆసుపత్రిలో ఉంటాడు. ఈ మొక్కలు ఏడు అడుగుల ఎత్తు, విషపూరిత స్టింగర్‌తో దాడి చేస్తాయి. అంతేకాకుండా ఈ మొక్కలు నడవగలవు కూడా. వీటిని ఆయిల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఒక రోజు రాత్రి, సోలార్ ఫ్లేర్స్ ఆకాశంలో కనిపిస్తుంది. దాన్ని చూసిన వాళ్ళు దాదాపు గుడ్డివాళ్లవుతారు. బిల్, కళ్లకు బ్యాండేజ్ వల్ల ఈ ఫ్లేర్స్‌ని చూడక, చూపు కోల్పోకుండా బతుకుతాడు. దీనివల్ల ఆసుపత్రి గందరగోళంలో ఉంటుంది. లండన్ వీధుల్లో గుడ్డివాళ్లపై ట్రిఫిడ్స్ దాడులు మొదలవుతాయి. బిల్, జో ప్లేటన్ అనే రేడియో ప్రెజెంటర్‌ని కలుస్తాడు. ఆమె ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల ఫ్లేర్స్‌ని చూడక బతుకుతుంది. బిల్, రేడియో బ్రాడ్‌కాస్ట్ ద్వారా ట్రిఫిడ్స్ ప్రమాదాన్ని హెచ్చరిస్తాడు. ట్రిఫిడ్ ఎక్స్‌పర్ట్‌ అయిన డెన్నిస్ కలవడానికి వీళ్ళు వెళ్తారు. ఈ సమయంలో, కోకర్ అనే సైనికుడు, సర్వైవర్స్‌ని సేకరిస్తూ, ట్రిఫిడ్స్‌తో పోరాడాలని ప్లాన్ చేస్తాడు. కానీ టొరెన్స్ అనే స్వార్థపరుడు లండన్‌ని తన రాజ్యంగా చేసుకోవాలనుకుంటాడు.

Read also- Coolie OTT: రజినీకాంత్ ‘కూలీ’ ఓటీటీలోకి ఎప్పుడంటే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రెండో భాగంలో బిల్, కోకర్ ఒక ఆశ్రమంలో ఆశ్రయం పొందుతారు. అక్కడ అబ్బెస్ డురాంట్ గుడ్డివాళ్లను, బలహీనులను ట్రిఫిడ్స్‌కి బలి ఇస్తుంది. బిల్ దీన్ని వ్యతిరేకిస్తాడు. ఇద్దరు చిన్న అమ్మాయిలను కాపాడుతూ, తన తండ్రి డెన్నిస్‌ని కలవడానికి బిల్ వెళ్తాడు. డెన్నిస్, ట్రిఫిడ్స్‌ని స్టెరిలైజ్ చేసే మ్యూటెంట్ ట్రిఫిడ్‌ని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ ప్రయోగంలో ట్రిఫిడ్ స్టింగ్‌కి గురై చనిపోతాడు. బిల్, జో, డెన్నిస్ ఇంట్లో కలుస్తారు. ఇక వీళ్ళు ఈ మొక్కలను అంతం చేసి మానవజాతిని కాపాడటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో వీళ్ళు విజయం సాధిస్తారా ? ఆ మొక్కలకు బలవుతారా ? అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.

IMDbరేటింగ్- 5.6/10

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!