Stray Dogs Attack: బాలుడిపై 4 కుక్కల దాడి.. రంగారెడ్డిలో దారుణం
Stray-Dogs (Image source X)
రంగారెడ్డి, లేటెస్ట్ న్యూస్

Stray Dogs Attack: బాలుడిపై ఒక్కసారిగా 4 కుక్కల దాడి.. రంగారెడ్డిలో దారుణం

Stray Dogs Attack: చిన్నపిల్లలపై వీధికుక్కల దాడులు ఆగడం లేదు. తాజాగా, తెలంగాణలో మరో ఘటన (Stray Dogs Attack) వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా హైదర్షాకోట్‌లో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఒకేసారి ఏకంగా నాలుగు శునకాలు ఎగబడి కరిచాయి. స్థానిక శాంతినగర్ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వేదాంత్ రెడ్డి అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే, బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లాలో మరోసారి వీధి కుక్కల దాడి కలకలం సృష్టించింది. హైదర్షాకోట్‌లోని శాంతినగర్ కాలనీలో గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. బాలుడిపై వీధి కుక్కలు దాడికి పాల్పడడం స్థానికంగా విచారకరంగా మారింది. బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యలు తల్లడిల్లిపోతున్నారు. బాలుడి ఒంటిమీద అయిన తీవ్రగాయాలు కలచివేస్తున్నాయి. చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్టు తెలిసింది.

కాగా, ఈ ప్రాంతంలో పిచ్చికుక్కల స్వైరవిహారంపై గతంలోనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. చిన్నపిల్లలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. స్థానిక అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల సమస్య నుంచి పిల్లల్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also- Bandi Sanjay: మున్సిపల్ ఆశావాహులకు బండి సంజయ్ వార్నింగ్.. ఫోన్ చేస్తే సీట్లు రావంటూ..!

చిన్నపిల్లలపై వరుస దాడులు

కాగా, హైదరాబాద్‌లో వీధి కుక్కల బెడద రానురాను మరింత ఎక్కువవుతోంది. ఇటీవలే కుత్బుల్లాపూర్‌ పరిధిలోని సూరారం కాల‌నీలో ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న 5 ఏళ్ల పిల్లాడిపై శునకాలు దాడి చేశాయి. బాలుడి కేకలు విని కుటుంబ సభ్యులు సకాలంలో బయటకు రావడంతో కుక్కలు పారిపోయాయి. బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. లేదంటే, తీవ్ర విషాదం చోటుచేసుకునేది. గాయాలపాలైన యువకుడిని కుటుం సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఇటీవలే అత్తాపూర్‌లో కూడా మరో ఘటన జరిగింది. వాసుదేవ్ రెడ్డి నగర్ కాలనీలో నిత్యశ్రీ అనే 3 ఏళ్ల చిన్నారిపై వీధి శునకాలు దాడి చేశాయి. ఇంటికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో చిన్నా ముఖంపై తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి, కుక్కల తరిమేయడంతో ప్రమాదం తప్పింది. చిన్నారికి ఏకంగా 18 కుట్లు పడ్డాయంటే కుక్కలు దాడి ఎంత తీవ్రంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

Read Also- Micro Dramas: న్యూయర్‌లో కొత్త దర్శకులను అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?

Just In

01

The Black Gold: సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ రిలీజ్‌పై మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఇదే..

Bhatti Vikramarka: కొత్త ఏడాది సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక సందేశం

Minister Seethakka: బొకేలు వద్దు.. బ్లాంకెట్లు తీసుకురండి.. మంత్రి సీతక్క కీలక సూచన

Rukmini: నటకిరీటి వదిలిన హారర్ కామెడీ మూవీ ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే?

Sabarimala Temple: శబరిమల ఆలయంలో భారీ బంగారం చోరీ.. సిట్ నివేదికలో సంచలన విషయాలు