Palm Tree Workers: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిభట్ల మున్సిపాలిటీ(Adibhatla Municipality) బొంగులూరు(Bonguluru) గ్రామంలో తాటి చెట్లను తొలగించిన భూ యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివిధ శాఖలకు వినతి పత్రాలు అందజేశారు. శనివారం రోజున బొంగులూరు కల్లుగీత కార్మికులు మూల నరసింహ. భర్తల. సత్తయ్య. మూల కృష్ణ బర్తల.జంగయ్య ఎరుకల యాదగిరి పడకంటి బలరాం మరి కొంతమంది కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఆదిభట్ల పిఎస్ లో ఎక్సైజ్ శాఖకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బొంగురు రెవెన్యూ పరిధిలో తాటి చెట్లను గీస్తూ తన జీవనోపాధిని పొందుతున్న గీతా కార్మికులకు తాటి చెట్లు నరికి వేయడంతో తమ జీవనోపాధి కోల్పోయామని అన్నారు.
Also Read: Ariana Glory: వర్షతో కిసిక్ టాక్స్‌లో సందడి చేసిన అరియానా.. రూమ్ రెంట్ కోసం ఏం చేసేదంటే?
చట్టపరమైన చర్యలు
సుమారు 25 చెట్లను సర్వేనెంబర్78. 79. 80. 90 గల భూములలో భూ యజమానులైన సామ జనార్దన్ రెడ్డి(Sama Janrdhan Reddy). అక్రమంగా గీతా కార్మికులకు తెలియకుండా తమ పొలంలో చెట్లను. నరికి వేశాడని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను. కోరామన్నారు. గ్రామంలో ఎంతోమంది కళ్ళు గీసుకుని తమ కుటుంబాలను పోషిస్తున్నామని అన్నారు. చెట్లు నరికిన. భూ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకొని గీతా కార్మికులందరికీ . తగిన న్యాయం. చేయాలని తెలిపారు. లేనియెడల గీతా కార్మికుల అందరము జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు. సదానంద గౌడ్. మల్లేష్ గౌడ్. చంద్రయ్య గౌడ్. శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
Also Read: Digvijaya Singh: మోదీ పాత ఫొటో షేర్ చేసిన దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు బహిర్గతం?

