Phone Tapping case: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు [Phone Tapping case] కీలకమైన మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు [Prabhakar Rao] పాస్ పోర్టును అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును వీలైనంత త్వరగా ఇక్కడికి రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభాకర్ రావు [Prabhakar Rao] విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారణకు వచ్చినపుడు ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తారా? లేక నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తారా? అన్నది సస్పెన్స్ గామారింది. దీనిపై ఓ దర్యాప్తు అధికారితో మాట్లాడగా ముందస్తు బెయిల్ కోరుతూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులపై ఈ అంశం ఆధారపడి ఉంటుందన్నారు. క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని రోజులకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే.
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ప్రత్యేకంగా ఓ బృందంతోపాటు తన ఆఫీస్ లో ప్రత్యేకంగా రెండు గదులను ఏర్పాటు చేసుకుని ఈ బాగోతాన్ని నడిపించినట్టు బయట పడింది. రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకులతోపాటు బీఆర్ఎస్ లోని కీలక నేతలు పోటీ చేసిన అసెంబ్లీ సెగ్మెంట్లలో బరిలో నిలబడ్డ కాంగ్రెస్ నేతలు, వారి బంధుమిత్రుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా బయటపడింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారని భావించిన పలువురు పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా వెల్లడైంది.
దీంట్లో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ [DGP Radhakrishnan] రావుతోపాటు ఓ టీవీ ఛానల్ అధినేత శ్రవణ్ రావు [Sravan Rao]కీలక పాత్ర పోషించినట్టుగా స్పష్టమైంది. సిట్ అధికారులు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతోపాటు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శ్రవణ్ రావును విచారిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో అప్పటి ఎస్ఐబీ ఛీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే అంతా కలిసి ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా తేలింది.
Also Read: Collector Muzammil Khan: ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు వేగవంతం.. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
కేసు నమోదు కాగానే…
కాగా, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసు నమోదు కాగానే ప్రభాకర్ రావు [Prabhakar Rao] అమెరికా వెళ్లిపోయారు. విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. తాను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ మెయిల్ ద్వారా విచారణాధికారులకు సమాచారం ఇచ్చారు. వర్చువల్ గా విచారణకు సహకరించటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే, [Prabhakar Rao] ప్రభాకర్ రావును నిశితంగా విచారించినపుడే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరన్నది బయటపడుతుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
దీనిపై ఓ అధికారితో మాట్లాడగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఇద్దరు కీలక మంత్రులు ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావును టీవీ ఛానల్ అధినేత శ్రవణ్ రావుకు పరిచయం చేసి ఈ వ్యవహారాన్ని నడిపించినట్టుగా ఇప్పటికే వెల్లడైందన్నారు.
రెడ్ కార్నర్ నోటీసులు…
ఈ క్రమంలోనే ప్రభాకర్ రావును వెనక్కి రప్పించేందుకు సీబీఐ ద్వారా అతని పేరు మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించారు. ఆ వెంటనే ప్రభాకర్ రావు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్యాప్తు ఎట్టి పరిస్థితుల్లోనూ [Prabhakar Rao] ప్రభాకర్ రావు వెనక్కి వచ్చేలా చూడాలని నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే అతని పాస్ పోర్టును రద్దు చేయాల్సిందిగా పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కోరింది. దీనిపై స్పందించిన పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు [Prabhakar Rao] ప్రభాకర్ రావు పాస్ పోర్టును రద్దు చేశారు. విషయాన్ని హైదరాబాద్ పోలీసులకు తెలిపారు.
Also Read: Malkajgiri court: పోక్సో కేసు నిందితునికి 20యేళ్ల జైలు శిక్ష.. ఆపై!
వడివడిగా చర్యలు…
[Prabhakar Rao] ప్రభాకర్ రావును వెనక్కి రప్పించేందుకు సిట్ అధికారులు వడివడిగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వర్గాల ద్వారా ప్రభాకర్ రావు [Prabhakar Rao] పాస్ పోర్ట్ రద్దయిన విషయాన్ని అమెరికా కాన్సులేట్ వర్గాలకు తెలియచేశారు. ఈ క్రమంలో అమెరికన్ పోలీసులు ఏ క్షణమైనా [Prabhakar Rao] ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకుని మన దేశానికి డిపోట్ చేయవచ్చని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయి ఉన్న నేపథ్యంలో ఆయన దేశంలోని ఏ విమానాశ్రయంలో దిగినా వెంటనే భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుంటాయన్నారు. ఆ తరువాత హైదరాబాద్ పోలీసులకు అప్పగిస్తాయని తెలిపారు. ఈ వారంలోనే ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి రావచ్చన్నారు.
Bhubharathi portal: భూ భారతి చట్టంతో రెవెన్యూకు కొత్త ఊపిరి.. జేఏసీ చైర్మన్.. వి.లచ్చిరెడ్డి
అరెస్టా?…విచారణా?…
ఇక, రాక తప్పని పరిస్థితి నెలకొని ఉన్న నేపథ్యంలో [Prabhakar Rao] ప్రభాకర్ రావు అరెస్ట్ తప్పక పోవచ్చన్న చర్చ పోలీసువర్గాల్లో జోరుగా నడుస్తోంది. కాగా, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన పట్ల దర్యాప్తు అధికారులు అంత కఠినంగా వ్యవహరించక పోవచ్చని కొందరు అధికారులు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో పాల్గొంటున్న ఓ అధికారితో మాట్లాడగా ప్రభాకర్ రావు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు వెలువరించే ఉత్తర్వులపై ఇది ఆధార పడి ఉందన్నారు.
అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించినా, ముందస్తు బెయిల్ మంజూరు చేసినా [Prabhakar Rao] ప్రభాకర్ రావును విచారణకు పిలిపించి ప్రశ్నిస్తామన్నారు. లేనిపక్షంలో ప్రశ్నిస్తామని, దర్యాప్తునకు ఆయన సహకరించక పోతే అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు