Nizamabad Crime: నిజామాబాద్ నగరంలో వినయ్ గౌడ్(Vinay Goud) అనే ఓ పాత నేరస్తుడు రెచ్చిపోయాడు. ఓ ప్లాటు విషయంలో పాత కక్షలతో శ్రీరామ్(Sriram) అనే వ్యక్తి పై నేరస్తుడు దాడికి దిగాడు. అంతటితో ఆగకుండ జిల్లాలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి ఈడ్చుకెళ్లి ఆ వ్యక్తిపై మరోసారి దాడి చేశాడు. ఈ సంఘటన ఇ నెల 9 వ తేదీన అర్థరాత్రి జరిగంది. గతంలో నేరస్తుడైన వినయ్ గౌడ్ పై ఫిర్యాదు చేసినా నాలుగవ టౌన్ ఎస్ఐ(SI) పట్టించుకోవటం లేదని అతడు తెలిపాడు. దీంతో శ్రీరామ్ అనే యువకుడు న్యాయం కోసం సిపిని కలవడానికి వెల్లగా ఆగ్రహించిన వినయ్ గౌడ్ నామీదే కంప్లుంట్ ఇస్తావా అంటూ మరో మారు వినయ్ గైడ్ తీవ్రంగా దాడిచేశాడు.
Also Read: Kavitha: కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టి.. కేటీఆర్ హరీష్ రావుల అరాచకాలు.. కవిత తీవ్ర విమర్శలు
గతంలో స్పందించని పోలీసులు
దీంతో శ్రీరామ్ రాష్ట్ర డిజిపిIDGP)కి, సిఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఈ సంఘటనపై స్పందించాలని బాధితుడి తన సోషల్ మీడియా(X)లో ట్వీట్ చేశాడు. పాత నేరస్తుడిపై గతంలో సిపిని ఆదేశించినా వినయ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదని బాధితుడి ఆవేదన వ్యక్తం చేశాడు. సీపీ కలిసిన అనంతరం ఈ ఘటన పై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసారు. యువకుడిపై దాడి చేసి కారులో ఎత్తుకెళ్లిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దం అయ్యారు. భాదితుడు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.
