Kamareddy News: ట్రాక్టర్ పై తీసుకెళ్తున్న వరి గడ్డి బెళ్ళకు విద్యుత్ వైర్లు తగిలి గడ్డి వాము కాలి బూడిదయ్యిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఒక చోటు నుండి మరో చోటుకు గడ్డి వామును తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది.
కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండలం కాటేపల్లి గ్రామంలో సాయంత్రం విద్యుత్ వైర్లు తగిలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
కాటేపల్లి నుంచి తండాకు వరిగడ్డి బెల్లను ట్రాక్టర్ సహాయంతో తీసుకు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ట్రాలీలో గడ్డిని పరిమితికి మించి ఎక్కువ ఎత్తుకు నింపడంతో గ్రామ శివారులోని కుమ్మరి కుంట వద్దగల విద్యుత్ వైర్లు గడ్డివాముకు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Also read: Serial Actress: ఫుడ్ వద్దు.. సిగ్గులేకుండా లవర్‌తో ముద్దు, బెడ్ కావాలంటోన్న సీరియల్ నటి!
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మంటలపై నీళ్ళు చల్లిన మంటలు అదుపులోకి రాలేదు. ట్రాక్టర్ డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి ట్రాక్టర్ ను అలాగే మంటలతో ముందుకు తీసుకువెళ్తూ గడ్డిని ట్రాక్టర్ ట్రాలీ నుంచి కిందికి పడేలా అటు ఇటు తిప్పి పెను ప్రమాదాన్ని తప్పించారు. దీంతో స్థానికులు డ్రైవర్ సాహసాన్ని పలువురు ప్రశంసించారు.