Nalgonda District: విత్ డ్రా చేయించేందుకు నేతలు ప్రయత్నాలు
Nalgonda District (imagecredit:twitter)
నల్గొండ

Nalgonda District: నాయకులను విత్ డ్రా చేయించేందుకు.. కీలక నేతలు విఫల యత్నాలు

Nalgonda District: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ గుబులు పట్టుకుంది. స్థానిక ఎన్నికల్లో గెలిచి పట్టు సాధించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న ప్రధాన పార్టీలకు రెబల్స్ ను ఎన్నికల బరి నుంచి తప్పించడం సవాలుగా మారింది. పంచాయతీ, వార్డు స్థానాలకు తమనంటే తమను బలపరచాలని కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS), ఇతర పార్టీల క్రియాశీలక ఆశావాహులు పెద్ద ఎత్తున లాబీయింగ్ నడపడంతో పాటు పార్టీనే నమ్ముకొని ఉన్నామని తేల్చి చెబుతూ ఆయా గ్రామ పంచాయతీలకు, వార్డులకు నుంచి పోటీకి పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన వారిలో ఒకే పార్టీ నుంచి ఇద్దరినుంచి ఐదుగురు వరకు పోటీపడుతున్నారు. ఈ తరుణంలో రెబల్స్ ను పోటీ నుంచి తప్పుకునేలా ఒప్పించేందుకు కీలక ప్రజాప్రతినిధులే రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఒకే పార్టీ నుంచి సర్పంచ్ స్థానాలకు గట్టి పోటీ ఎదురైన జిపీలలో.. అభ్యర్థులను పోటీనుంచి తప్పుకుంటే రానున్న ఎంపీటీసీ(MPTC), జెడ్పీ టీసీ(ZPTC) ఎన్నికల్లో టికెట్ ఇస్తామని కీలక నేతలు ఆఫర్లు ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని గ్రామపంచాయతీలో ఈ తరహా ఒప్పందాలతో.. సర్పంచ్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేయగా మరికొన్ని గ్రామపంచాయతీలో పార్టీ సపోర్ట్ లేకున్న రెబల్స్ గా బరిలోకి ఉండేందుకు పావులు కదుపుతున్నారు.

Also Read: Job Scam: విదేశీ ఉద్యోగం అని గంతేస్తున్నారా? నకిలీ జాబ్ మోసాలు వెలుగులోకి!

విత్ డ్రాలకు విఫల యత్నాలు

గ్రామపంచాయతీ ఎన్నికల్లో పట్టు సాధించాలని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో నామినేషన్లు వేసి బరిలో ఉన్న అభ్యర్థులలో గెలిచే అవకాశం ఉన్న వారికి మద్దతుగా నిలుస్తూ ఓడిపోయే ఛాన్స్ ఉన్న అభ్యర్థులను విత్ డ్రా చేయించేందుకు ప్రధాన పార్టీల లీడర్లు మంతనాలు సాగిస్తున్నారు. ఆర్థిక ప్రలోభాలతో పాటు రానున్న రోజుల్లో ఇచ్చే పదవులు ఆశ చూపుతూ నామినేషన్ల ఉపసంహరణకు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో మొదటి దశలో ఎన్నికలలో భాగంగా నల్గొండ(Nalgonda), చండూరు(Chanduru) రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలాలోని 318 జీపీ(GP)లలో 2693 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా 2870 వార్డులకు 8469 నామినేషన్లు వేసిండ్రు. మొదటి విడత నామినేషన్ల విత్ డా ప్రక్రియ ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం వరకు ముగియనుండగా అదేరోజు పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. కలిసి వచ్చే పార్టీలతో స్థానిక ఎన్నికల్లో ముందుకెళ్తున్న ప్రధాన పార్టీలు సొంత పార్టీకి చెందిన రెబల్స్ ఏ మేరకు ఎన్నికల ఫలితాల పై చూపనున్నారు అనేది ప్రధాన పార్టీలకు ఉత్కంఠ గా మారింది.

జోరుగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ(Miryalaguda) రెవెన్యూ డివిజన్ లో రెండో విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్లు వేస్తున్నారు. ఈ డివిజన్ కింద ఉన్న 10 మండలాల పరిధిలోని 282 జీపీలకు తొలి రోజు 163 నామినేషన్లు దాఖలు కాగా 2418 వార్డులకు 156 నామినేషన్లు వచ్చాయి. రెండవ రోజు సోమవారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.

Also Read: Bigg Boss Telugu 9: తనూజ, ఇమ్ము ఏడిపించారు కదయ్యా.. జోక్ అంటారేంటి? ఫైరింగ్ నామినేషన్స్

Just In

01

Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గారి కోసం నయన్‌కు ‘దృశ్యం’ కథ చెప్పిన అనిల్ రావిపూడి!

Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..

Sai Durgha Tej SYG: ఎద్దును పట్టుకుని.. ఊరమాస్ అవతార్‌లో తేజ్.. పోస్టర్ వైరల్!

Municipal Elections: మున్సీపాలిటీ వార్డుల రిజర్వేషన్‌పై ఉత్కంఠ.. నేడో రేపో రిజర్వేషన్ల ఖరారు