MP DK Aruna: గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారానే సాధ్యమని పాలమూరు ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) పేర్కొన్నారు శనివారం గద్వాలలోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు రాక అధికారుల చుట్టూ సర్పంచులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారన్నారు. స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిధులు లేక లక్ష రూపాయల పనికూడా చేయలేక పోతున్నాం అంటున్నారన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చేది మోదీ ప్రభుత్వమేనని అన్నారు. గ్రామాల్లో రోడ్లు గుంతలు పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా నిర్మాణాలపై దృష్టి పెట్టడం లేదన్నారు.
జూరాల ప్రాజెక్ట్‌లో..
అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్ళామని ఎమ్మెల్యే అంటున్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికార పార్టీకి వెళ్లారా లేక సొంత ప్రయోజనాల కోసం వెళ్ళరా అనేది ప్రజలకు తెలుసన్నారు. గతంలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నది అధికార పార్టీనే కదా.. చేసిన అభివృద్ది ఏదన్నారు. మేము ప్రారంభించిన నెట్టెంపాడు, గట్టు లిఫ్ట్ లను రెండు టర్ములు అయినాపూర్తి చేయలేదన్నారు. గట్టు లిఫ్ట్ పూర్తి కావాలంటే ఇంకా ఆరునెలలు కావాలని అంటున్నారని, జూరాల ప్రాజెక్ట్ లో మెయింటనేన్స్ లేదన్నారు. జూరాల ప్రాజెక్ట్ ను కాపాడాలంటే.. సమాంతరంగా సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణం చెప్పటాల్సిన అవసరం ఉందన్నారు. జూరాల ప్రాజెక్టు కు భవిష్యత్ లో నష్టం జరిగితే.. పూర్తి బాధ్యత సీఎం వహించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణలో భవిష్యత్ లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజానీకం, యువత కోరుకుంటున్నారు.
Also Read: Vande Bharat Sleeper: వందేభారత్ ‘స్లీపర్’ వచ్చేస్తోంది.. తొలి రైలు ఏ మార్గంలో ఖరారైందంటే?
ఈ కార్యక్రమంలో..
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ధారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి ,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావ్,అసెంబ్లీ కి పోటీ చేసిన అభ్యర్థులు శివారెడ్డి ,రాజగోపాల్, పట్టణ అధ్యక్షురాలురజక జయశ్రీ, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు సమత మధు గౌడ్, తదితరులు ఉన్నారు.

