Konda Surekha ( image credit: twitter)
తెలంగాణ

Konda Surekha: ధ‌ర్మ‌పురి ఆల‌యాన్ని స‌మ‌గ్రంగా అభివృద్ధి చేస్తాం.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

Konda Surekha: ధ‌ర్మ‌పురి లక్ష్మీనరసింహ స్వామి ఆల‌యాన్ని స‌మ‌గ్రంగా అభివృద్ధి చేస్తామ‌ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు. గోదావ‌రి పుష్క‌రాల‌కు ఏర్పాట్లు చేయాల‌ని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ధ‌ర్మ‌పురి ఆల‌య మాస్ట‌ర్ ప్లాన్ పై సోమవారం రివ్యూ స‌మావేశం నిర్వహించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాల‌ని ఆదేశించారు.ఈ సంద‌ర్భంగా సురేఖ మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు ఆగమశాస్త్రం, వేద పండితులు, స్థానికుల, భక్తులు మనోభావాలకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులు చేపట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Also Read: Konda Surekha: రైతులు ఎవరు అదైర్య పడవద్దు నష్టపరిహరం చెల్లిస్తాం: మంత్రి కొండ సురేఖ

ప్రత్యేక ప్రణాళిక సిద్ధం

ధ‌ర్మ‌పురి లక్ష్మీనరసింహస్వామి స్వయంభు మూర్తి, రుషులు, దేవతలు సంచరించిన పవిత్ర ప్రాంతం, ఈ అంశం దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేప‌ట్టాల‌ని సూచించారు. 2027 జూలైలో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగిన సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మాస్ట‌ర్ ప్లాన్ కు అవ‌స‌ర‌మైన స్థ‌ల సేక‌ర‌ణ వివ‌రాలు మంత్రి, అధికారుల‌ను అడిగి సంపూర్ణంగా తెలుసుకున్నారు. స్థ‌ల పురాణం ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. మొత్తం రూ.50కోట్ల‌తో చేప‌ట్టే నిర్మాణాల్లో ఎక్క‌డా రాజీ ప‌డకుండా చూడాల‌ని చెప్పారు.

ఆల‌యాన్ని విస్తృతంగా అభివృద్ది

మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి ఆల‌యాన్ని విస్తృతంగా అభివృద్ది చేస్తున్న మంత్రి కొండా సురేఖకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప‌ని ఒత్తిడిలోనూ ఆలయం కోసం ప్ర‌త్యేకంగా టైం కేటాయించి, అభివృద్ధి చేపట్ట‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ టెంపుల్ కోసం అయ్యే స్థ‌ల సేక‌ర‌ణ‌కు సంబంధించిన అంశాల్లో తాను ప్ర‌త్యేకంగా చొర‌వ తీసుకుంటాన‌ని హామీనిచ్చారు. అంద‌రి స‌హ‌కారంతో గోదావ‌రి పుష్క‌రాలు కూడా విజ‌య‌వంతంగా చేస్తామ‌ని హామీనిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

జ‌ల‌ప్ర‌సాదం వ‌స‌తి, మండ‌ప నిర్మాణం

ప్ర‌ధాన దేవాల‌య విస్త‌ర‌ణ‌, వైకుంఠ ద్వార నిర్మాణం, క్యూలైన్ కాంప్లెక్స్‌, టిన్ షెడ్స్‌, వ్ర‌త మండ‌ప నిర్మాణం, కాల‌క్షేప మండ‌ప నిర్మాణం, ప్ర‌సాదం కౌంట‌ర్ల నిర్మాణం, నిత్య క‌ళ్యాణ మండ‌ప నిర్మాణం, మ‌హా ప్రాకార నిర్మాణ, ర‌థశాల నిర్మాణ‌, జ‌ల ప్ర‌సాదం డ్రింకింగ్ వాట‌ర్ వ‌స‌తులు కల్పించడం జరుగుతుందన్నారు. గోదావ‌రి తీరంలో గ‌ల స్థ‌లంలో పెద్ద డార్మిట‌రీ హాల్స్ నిర్మాణం, స్త్రీలు బ‌ట్ట‌లు మార్చుకొనుట‌కు డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ నిర్మాణం, సుల‌భ్ కాంప్లెక్స్ నిర్మాణం, ష‌వ‌ర్స్ నిర్మాణం, జ‌ల‌ప్ర‌సాదం వ‌స‌తి, మండ‌ప నిర్మాణం, నిత్యాన్న‌దాన భ‌వ‌నం నిర్మాణం చేప‌ట్టే పనులు అన్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సి ప‌ల్ సెక్రట‌రీ శైల‌జా రామ‌య్య‌ర్, ఎండోమెంటు డైరెక్ట‌ర్ హ‌రీష్, ఉన్న‌తాధికారులు, ఆల‌య ఈవోలు పాల్గొన్నారు.

Also Read: Konda Surekha: రాష్ట్రానికి తలమానికంగా నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్: మంత్రి కొండా సురేఖ

Just In

01

Hyderabad Rail Alert: హైదరాబాదీలూ బీ అలర్ట్.. రాగల 2 గంటల్లో అకస్మాత్తుగా వర్షాలు

CM Revanth Reddy: జర్మనీ టీచర్లను నియమిస్తాం.. విద్యార్థులకు భాష నేర్పిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

Viral Video: ఒరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. రైల్వే ప్లాట్ ఫామ్‌పైనే కాపురాలు పెట్టేశారు.. మీకో దండంరా అయ్యా!

Free ChatGPT: ఉచితంగా చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్.. ఆశ్చర్యపరిచే నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

Kishan Reddy: ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నా: కిషన్ రెడ్డి