Bike Thieves Arrested: వివిధ ప్రాంతాలలో బైకులను దొంగిలించే ఇద్దరు బైక్ దొంగలను పట్టుకొని వారి వద్ద ఎనిమిది బైకులను స్వాధీనం చేసుకున్నట్లు జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జహీరాబాద్ పట్టణంలోని సుభాష్ గంజ్ లో నివాసముండే ఇంటర్ విద్యార్థి అల్తాఫ్ హుస్సేన్, మరో మైనర్ విద్యార్థితో కలిసి జహీరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, హైదరాబాద్ ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడ్డారు.
శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ముందు పట్టణ ఎస్ఐ కాశీనాథ్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అల్తాఫ్ హుస్సేన్, మరో మైనర్ వేర్వేరు బైక్ లపై హైదరాబాదు వైపు వెళుతుండగా అనుమానం వేసి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా బైకులు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. వారి నుండి దొంగిలించిన ఎనిమిది బైకులను, దాడి చేసేందుకు ఉపయోగించే కమ్మ కత్తి, చాకు వంటి మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Also read: Aghori Srivarshini: పెట్రోల్ క్యాన్ రెడీ.. చస్తే మీదే బాధ్యత.. అఘోరీ వార్నింగ్!
బైకులను దొంగిలించే సమయంలో ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేసేందుకు కమ్మ కత్తి, చాకులను తమ వెంట ఉంచుకుంటారని ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడరని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జహీరాబాద్ సిఐ శివలింగం, ఎస్ఐ కాశీనాథ్,సిబ్బంది పాల్గొన్నారు.