Mahender Reddy: మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేతకు జాతీయ స్థాయిలో పదవి వరించింది. మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అంకమ్మగారి మహేందర్ రెడ్డి(Mahender Reddy) నీ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్ గా ఏఐసీసీ(AICC) నియమించింది.ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్(KC Venu Gopal) నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మహేందర్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగారు. మెదక్ పట్టణానికి చెందిన మహేందర్ రెడ్డి గతంలో మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేశారు. యువజన కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ సెక్రటరీగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆర్, జి, పీ ఆర్, ఎస్,స్టేట్ ఆఫీస్ బేరర్ గా పార్టీకి సేవలు అందించారు. మహేందర్ రెడ్డి సేవలను ఏఐసీసీ పరిగణనలోకి తీసుకొని రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్ గా నియమించారు.
Also Read: Tollywood: ట్రెండ్ మారింది.. సినిమా పబ్లిసిటీకి స్టార్స్ అవసరం లేదు.. ఆ పాత్ర కూడా జర్నలిస్ట్‌లదే!
నాపై బాధ్యత మరింత పెరిగింది
తనను రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్ గా నియమించడం తో తనపై బాధ్యత మరింత పెరిగిందని మహేందర్ రెడ్డి(Mahender Reddy) తెలిపారు. పదవి వరించిన సందర్భంగా స్వేచ్చతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి రాహుల్ గాంధీ(Rahul Gandhi) , ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), కే సీ వేణుగోపాల్(KC Venugopal), ఆర్ జి పీ ఆర్ ఎస్, చైర్మన్ సునీల్ పన్వార్(Sunil Panwar), ఏఐసిసి తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natrajan), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసిసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు(Mynampally Hanumantha Rao), మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు(MLA Rohit Rao) లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మహేందర్ రెడ్డి తెలిపారు.
Also Read: Ramchander Rao: పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే వేటే.. దూకుడు పెంచిన రాంచందర్ రావు!
