Rally in Sangareddy: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీ పీ సీ సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ,జై బీమ్,జై బాపు, సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. టీ జీ ఐ ఐ సి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ భగవంతుడా అని అమిత్ షా అవమానించాడు, బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలను చేపట్టింది.
కేంద్రంలో బీజేపి అధికారంలో ఉందంటే బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తోనే ప్రధాని నరేంద్ర మోడీకి,అమిత్ షా కు పదవులు వచ్చాయని జగ్గారెడ్డి విమర్శించారు.
సంగారెడ్డి లో ప్రజలు కోరుకొనే కోరికలను సీఎం రేవంత్ రెడ్డి,సహకారం,రాహుల్ గాంధీ సహకారంతో తీర్చుతానని అన్నారు.త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సభ సంగారెడ్డి లో ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
Also read: Bhu Bharathi Portal: భూమి హక్కులకు న్యాయబద్ధత.. భూ భారతి చట్టం మీకు తెలుసా?