Damodar Rajanarsimha: ఈనెల 23వ తారీఖున జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్,అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ ,బందోబస్తు, బారికేడ్లు , ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు,హెలిప్యాడ్ , హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహావిష్కరణ, కేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం, మహిళా పెట్రోల్ బంకు, జిల్లా అభివృద్ధికి కావలసిన కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసి, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల పై ఏర్పాటు చేసిన స్టాల్ లను పరిశీలించి సభ లో పాల్గొంటారని తెలిపారు. ఈ సమీక్షా సమావేశం లో ఎంపీ సురేష్ షెట్కర్. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఇతర జిల్లా స్థాయి అధికారులు అందరూ పాల్గొన్నారు.
23 న సిఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న కేంద్రియ విద్యాలయం
క్రమశిక్షణకు మారుపేరుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కేంద్రియ విద్యాలయం ప్రారంభనికి సిద్దమైంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం నిమ్జ్ కు సమీపంలో ఉన్న కేంద్రియ విద్యాలయం ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 2022-23లో మంజూరి కాగా అక్టోబర్ లో భవనం పనులు పూర్తి అయ్యాయి.
26కోట్లతో నిర్మించిన ఈ కేంద్రియ విద్యాలయంలో 10వ తరగతి వరకు విద్యను అందిస్తున్నారు. 11ఎకరాలను కేంద్రియ విద్యాలయానికి కేటాయించారు. 423మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విశాలమైన 45 గదులను నిర్మించారు. ఉపాధ్యాయులు అక్కడే ఉండే విధంగా వారికీ అకమిడేషన్ కల్పించారు. సిఎం కేంద్రియ విద్యాలయాన్ని ప్రారంభించిన పిమ్మట పూర్తి స్థాయిలో రన్ కానుంది.
23 న జహీరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి రాక పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేయనున్న రేవంత్
జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనల కోసం ఈనెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ రానున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 100కోట్లతో నిర్మించిన నింజ్ రోడ్డు, 35 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనం, 100 కోట్ల తో నిర్మించిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేస్తారు. జహీరాబద్ మండల పరిధిలోని ఉగ్గెలి కూడలి వద్ద ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
Also Read: Raj Bhavan Theft: రాజ్ భవన్ చోరీ కేసులో భారీ ట్విస్ట్.. ఈ దొంగ మామూలోడు కాదు భయ్యా!
అనంత రం జహీరాబాద్ లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం మాట్లాడుతారు. ముఖ్యమంత్రి రాక సందర్బంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ ల ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. హెలికాప్టర్ దిగేందుకు హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు.వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పోలీస్, రెవెన్యూ, వైద్యారోగ్య, ఆర్ అండ్ బీ,పంచాయతీరాజ్, వాతావరణ శాఖ, విద్యుత్, ఆరోగ్య తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్, ఎంపిలు సమీక్షలు చేస్తున్నారు. సభ విజయవంతం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సన్నాహక సమావేశం సైతం నిర్వహించగా రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి,కాంగ్రెస్ ఇంచార్జి చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు