Medak District: లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్
Medak District (imagecredit:swetcha)
క్రైమ్, మెదక్

Medak District: రైతు వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్.. ఎంతంటే..!

Medak District: రైతు వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు యెల్దుర్తి మండల సర్వేయర్ శ్రీనివాస్ దొరికాడు. ఓ రైతు తన పోలం విషయంలో డిజిటల్ సర్వే చేయమని అడగా సర్వేయర్ లంచం డామాండ్ చేశాడు. వివరాల్లోకి వెలితే..!

Also Read: Commissioner Sunil Dutt: పోలీసులకు కమిషనర్ సునీల్ దత్ కీలక సూచనలు.. తేడా రావద్దంటూ..!

ట్రైనీ సర్వేయర్‌కు డబ్బులు

ఏసీబీ(ACB) వలలో రెండు అవినీతి రెవెన్యూ చేపలు చిక్కాయి. మెదక్ జిల్లాలో యెల్దుర్తి మండలంలో స్థానికంగా ఓ రైతు తనకున్న ఒక ఒక్క ఎకరం 10 గుంటలు భూమిని డిజిటల్ సర్వే కోసం(digital survey) మండల సర్వేయర్ శ్రీనివాస్ కు దరఖాస్తు పెట్టుకోగా 20000 డిమాండ్ చేసినట్లు ఏసిపి డిఎస్పి సుదర్శన్ తెలిపారు. స్థానిక రైతు నవంబర్ 26న తమ కార్యాలయానికి వచ్చి ఈ విషయమే ఫిర్యాదు చేశారని డిఎస్పి అన్నారు. డబ్బుల డిమాండ్ పై తాము విచారణ జరిపామని నిజమని తేలడంతో బుధవారం ఫిర్యాదు చేసిన రైతు రూపాయలు 20,000 ఇచ్చేందుకు సర్వేయర్ కు ఫోన్ చేయగా స్థానిక ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద ఫీల్డ్‌‌లో ఉన్న సర్వియర్ శ్రీనివాస్ అక్కడికి రావాలని రైతును సూచించారు. దీంతో డబ్బులను పక్కనే ఉన్న ట్రేని సర్వేయర్ గౌరీ శరత్ కుమార్ గౌడ్(Surveyor Gauri Sarath Kumar Goud) కు ఇవ్వాలని తెలుపగా రైతు ట్రైనీ సర్వేయర్(Trainee Surveyor) కు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నామని ఆయన తెలిపారు. ఇద్దరినీ అదుపు తీసుకొని స్థానిక కార్యాలయంలో విచారించామని డిఎస్పి తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన అన్నారు. పట్టుబడ్డ ఇద్దరినీ రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.

Also Read: AICC Meenakshi Natarajan: మూడు నెలల్లో డీసీసీలు మీ పనితీరు నిరూపించుకోవాల్సిందే.. లేకుంటే తప్పుకోండి: మీనాక్షి నటరాజన్

Just In

01

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

OnePlus 13: OnePlus 13 ఫోన్ కు 10 వేల డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్