Nagarkurnool District: నాణ్యమైన విద్య, వైద్యం అందించఢమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarasimha) అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool district) కేంద్రంలో 9కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల భవనం, 10కోట్లతో కేసరి సముద్రం చెరువుపై నిర్మించే హై లెవల్ కెనాల్ బ్రిడ్జి, 2కోట్ల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన మరియు 1కోటితో నిర్మించిన జెడ్పీ అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవాల్లో ఎంపీ డాక్టర్ మల్లురవి(MP Mallu Ravi), ఎంల్‌సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి(MLC Dhamodhara Reddy), ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి(MLA Rajesh Reddy), డాక్టర్ వంశీకృష్ణ, కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు.
సమాజానికి సేవ చేయాలి
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా సమాజానికి సేవ చేయాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నామన్నారు. స్పోర్ట్స్, స్కూల్, ఆర్ట్స్ యూనివర్శిటీలు తెచ్చామన్నారు. లెఫ్రాలజీ, ఆర్థో ఆప్తమాలజీ, ట్రామాకేర్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. రాష్ట్రంలో 109ట్రామా కేంద్రాల నిర్మాణం చేశామని, వృద్ద తల్లిదండ్రుల కోసం 37ప్రణామ్ కేంద్రాలు స్థాపించామని, అన్నారు. రాష్ట్రంలో 200కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. న్యూట్రిషన్ ఆహారం, స్కిల్ ఎడ్యుకేషన్ విధానం కావాలన్నారు.
బాలికల విద్యకు ప్రాధాన్యత
నాగర్‌కర్నూల్‌కు 70లక్షల వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలన్నారు. సేవ చేసే నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే హక్కు ఉందని, అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అన్నారు. అమ్మాయి చదువుకుంటే కుటుంబం అంతా చదువుకున్నట్లే అన్నారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం బాలికల విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. కొత్తగా 16నర్సింగ్ కాలేజీలు తెచ్చామన్నారు. జర్మనీ, జపాన్, స్వీడన్ లో నర్సింగ్ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, ప్రభుత్వం కాలేజీల్లో ఆ భాషలను కూడా నేర్పిస్తుందన్నారు. పేదలకు కావాల్సిన విద్యా, వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, సమాజానికి ఆస్తిగా మరాలన్నారు. మహిళా సాధికరత కింద కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
Also Read: SERP Survey: రాష్ట్రంలో అత్యంత పేదలను గుర్తించేందుకు సర్కార్ ప్లాన్.. త్వరలో సర్వే..!

