Jogulamba Temple: జోగులాంబ ఆలయ ఉప ప్రధాన ఆర్చకుడుగా విధులు నిర్వహిస్తున్న ఆనందశర్మపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అనంతరం దేవదాయ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆలయ కార్యకలాపాల్లో ఆనంద్ శర్మ మాటే వేదంగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఆలయ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారని ధార్మిక సంస్థలు,భక్తులు దేవాదాయ కమిషనరేట్ లో,మంత్రికి ఫిర్యాదు చేశారు.
Also Read; Gadwal Protest: పచ్చని పల్లెల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ.. సమిష్టిగా వ్యతిరేకిస్తున్న రైతులు!
పలు దఫాలుగా ఆలయంలో విచారణ జరిపిన అనంతరం ఆరోపణలు నిజం కావడంతో ఆ నివేదిక ఆధారంగా దేవాదాయ శాఖ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమశిక్షణ చర్యలు తక్షణం అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. జిల్లాను వదిలి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది. ఆలయానికి సంబంధించిన ఆభరణాలు, వస్తువులు అప్పగించాలని ఆదేశించింది. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా అక్రమాలకు ఆనంద్ శర్మ పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు