MLA Bhukya Murali( image credi:swetcha reporter)
మహబూబ్ నగర్

MLA Bhukya Murali: బడా బాబులే ముఖ్యమా.. ఎమ్మెల్యే మురళి నాయక్!

MLA Bhukya Murali: భారతదేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసమే… కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సం విధాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ పేర్కొన్నారు.  రాత్రి నెల్లికుదురు మండల కేంద్రంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ..భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

 Also Read: Modi and Chandrababu: అమరావతి పునఃప్రారంభం.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం

నేడు పేద,బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యం అన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు, అంబెడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు.

ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం కల్గించి, రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?