Gadwal News: జిలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు 100% ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ పక్క ప్రణాళిక అమలు చేస్తోంది. విద్యార్థుల భవితకు తొలిమెట్టు పదవ తరగతి కావడంతో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో సాధించే మార్కులు సబ్జెక్టు నైపుణ్యాలు భవిష్యత్తు కోసం పునాదులుగా నిలుస్తాయి. పదవ తరగతి వార్షిక పరీక్షల సమీపిస్తున్న నేపథ్యంలో ఈ నెల మొదటి వారం నుంచి ప్రతి రోజు ఉదయం,సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకు ఒక్కో సబ్జెక్టు ఉపాధ్యాయుడు స్టడీ అవర్స్ నిర్వహించి పాఠ్యాంశాలల్లో సందేహాలు నివృతి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి సంబంధిత ఎంఈఓ, హెచ్ఎం, ఉపాధ్యాయులకు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ జారీ చేశారు.
పక్కా ప్రణాళికతో
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 6,447 విద్యార్థులు ఉన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 4 నుంచి 5 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నవంబర్ నుంచి ఉదయం వేళల్లో ప్రత్యేక తర్వాత నిర్వహిస్తుండగా జనవరి మొదటి వారం నుంచి ఉదయం సాయంత్రం వేళలో ప్రత్యేక తర్వాత నిర్వహిస్తున్నారు. 19 రోజులపాటు స్నాక్స్ సైతం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
Also Read: Minister Ponguleti: విపక్షాల కారుకూతలు నమ్మోద్దు.. పట్టణాల్లో పాగా వేద్దాం: మంత్రి పొంగులేటి
ఫలితాలు మెరుగుపడేలా
గతేడాది పదవ తరగతి పరీక్ష ఫలితాలలో జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal district) 91.74 శాతంతో ఉత్తీర్ణులవగా రాష్ట్రంలో 26 వ స్థానంలో నిలిచింది. 474 ప్రభుత్వ పాఠశాలలో 6447 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సంబంధిత ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో స్పెషల్ క్లాసులతో శత శాతం ఫలితాలు సాధించేలా సన్నద్ధమవుతున్నారు
విద్యార్థుల సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి
ప్రత్యేక తరగతులు ఉదయం సాయంత్రం నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి ప్రణాళిక తరగతి నిర్మాణ బహుళ విభాగాలు బోధన మాధ్యమాలు ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రతి దానికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. కీలక సబ్జెక్టులలో విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తూ వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. రెగ్యులర్ పీరియడ్‌లో పాఠం అంశం వివరణ అంశానికి సంబంధించిన విద్యా ప్రమాణాల ఆధారంగా పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది స్థాయి ఆధారిత అభ్యాసం గ్రాఫులు రేఖాగణిత నిర్మాణాలతో పాటు వ్యక్తిగతీకరించిన విద్యా మార్గదర్శకత్వం మద్దతు అందించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల పురోగతి ట్రాక్ చేయటానికి సబ్జెక్టు ఉపాధ్యాయుడు వివరనాత్మక రికార్డులను నిర్వహించాలి. ప్రతి విద్యార్థి పురోగతిపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది
Also Read: Substandard Bridge: నాసిరకం బ్రిడ్జిను నిర్మిస్తున్న కాంట్రాక్టర్.. బయటపడ్డ బండారం.. ఫొటో ఇదిగో

