Maganti Family Dispute (Image Source: Twitter)
తెలంగాణ

Maganti Family Dispute: మాగంటి అసలైన వారసుడ్ని నేనే.. నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ప్రద్యుమ్న తారక్

Maganti Family Dispute: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మాగంటి కుటుంబంలో అనూహ్యంగా వివాదం చెలరేగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నిజమైన వారసత్వం తమదేనంటూ కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మెుదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న తారక్.. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపినాథ్ కు అసలైన వారసులం మేమేనంటూ తేల్చి చెప్పారు. అయితే రాజకీయం, ఆస్తుల కోసం తాను ఫైట్ చేయట్లేదని.. ఐడెంటిటీ కోసమే తన పోరాటమని ప్రద్యుమ్న తారక్ స్పష్టం చేశారు.

‘చనిపోయేవరకూ టచ్‌లో ఉన్నా’

మాగంటి అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆస్పత్రికి కూడా రాని మీరు ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చారన్న ప్రశ్నకు సైతం ప్రద్యుమ్న సమాధానం ఇచ్చారు. తాను గత కొంతకాలంగా అమెరికాలో ఉంటున్నట్లు చెప్పారు. అయితే తన తండ్రి మరణించే వరకూ కూడా మాగంటి గోపినాథ్ తో టచ్ లోనే ఉన్నట్లు ప్రద్యుమ్మ తెలిపారు. ఆయన ఆరోగ్యం గురించి నిరంతరం తెలుసుకుంటూనే ఉన్నట్లు చెప్పారు. అయితే ఓ రోజు తనకు కాల్ వచ్చిందని.. తన నాన్న ఫ్రెండ్ ఫోన్ చేసి మాగంటి చనిపోయిన విషయాన్ని చెప్పారని అన్నారు.

‘అంత్యక్రియలు రాకుండా అడ్డుకున్నారు’

తన తండ్రి మరణవార్త తెలియగానే ఇండియాకు వచ్చేయాలని తాను సిద్ధమవుతుండగా.. మోహన్ ముళ్లపూడి అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు ప్రద్యుమ్న తెలిపారు. ఆ ఫోన్ లో బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనతో మాట్లాడినట్లు చెప్పారు. అంత్యక్రియలకు ఏమి రావొద్దని పదే పదే చెప్పినట్లు పేర్కొన్నారు. ‘నువ్వు వస్తే ఇక్కడ సమస్యలు వస్తాయి. కాబట్టి రావొద్దు. ఇండియా నుంచి వచ్చిన ఎవరి ఫోన్లు ఎత్తవద్దు. మేము అన్ని చూసుకుంటాం’ అని హెచ్చరించినట్లు ప్రద్యుమ్న వివరించారు. ఆ సమయంలో తన తల్లి చెన్నైలో ఉందని.. నేను అందుబాటులో లేనందున ఆమెకు ఎలాంటి ముప్పు వస్తుందోనన్న భయంతో అంత్యక్రియలకు పంపలేదని ప్రద్యుమ్న చెప్పుకొచ్చారు.

అంత్యక్రియలు సాఫీగా జరగాలని

ఇండియాకు వచ్చి ప్రస్తుతం తన తల్లితో ఉంటున్నట్లు ప్రద్యుమ్న తెలిపారు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన బెదిరింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. అయితే తన తండ్రి అంత్యక్రియలు ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా జరగాలన్న ఉద్దేశంతోనే తాను దూరంగా ఉన్నట్లు కూడా ప్రద్యుమ్న తెలిపారు. మళ్లీ తాను అంత్యక్రియలకు వచ్చి.. అందులో అంసాఘిక శక్తులు దూరి.. కుటుంబ సమస్యను మరింత పెద్దదిగా చేయకూడదని ఆగిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఎలక్షన్ కమీషన్ కు చేసిన ఫిర్యాదు గురించి కూడా ప్రద్యుమ్న స్పందించారు. తన తల్లి ఉండగానే ఆమె లేదని నమ్మించే కుట్ర చేశారని ఆరోపించారు. అందుకే తాను ఈసీ ఆశ్రయించినట్లు చెప్పారు.

Also Read: GHMC: అంతా మీ ఇష్టమా.. మా అనుమతులు తీసుకోరా.. జలమండలిపై జీహెచ్ఎంసీ గరం గరం

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం..

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసత్వం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం (ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్) నేపథ్యంలోనే ఈ వివాదం చెలరేగింది. చట్టబద్ధమైన వారసులను నిర్ధారించే ఈ పత్రాన్ని మాగంటి సునీత ఇటీవల రెవెన్యూ అధికారుల నుంచి పొందారు. అయితే, ఈ సర్టిఫికెట్‌పై గోపినాథ్ మొదటి భార్యగా పేర్కొంటున్న మాగంటి మాలని దేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మ పేర్లను చేర్చకుండా, తప్పుడు సమాచారంతో సునీత ఈ ధృవీకరణ పత్రాన్ని పొందారని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం శేర్లింగంపల్లి ఎమ్మార్వో ఆఫీసుకు మాలని దేవి, ప్రద్యుమ్నతో పాటు మాగంటి సునీత తరపున ఆమె చిన్నకూతురు దీశిరా, అడ్వకేట్ విచారణకు వచ్చారు. ఇరు పక్షాల స్టేట్ మెంట్ ను రెవెన్యూ అధికారులు రికార్డ్ చేసుకున్నారు.

Also Read: Recharge Plans: మొబైల్ వినియోగదారులకు షాక్‌.. మళ్ళీ పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ ధరలు..

Just In

01

Katrina Kaif: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన వెంకటేష్ హీరోయిన్.. సంబరాల్లో ఫ్యాన్స్

Kia Carens: కియా క్యారెన్స్‌ ఇప్పుడు CNG వెర్షన్‌లో లాంచ్‌.. మైలేజ్‌, ధర, ఫీచర్లపై ఫుల్ డీటెయిల్స్!

Pawan Kalyan: ‘ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం’.. డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం

SSMB29 Kumbha first look: ‘SSMB29’నుంచి మరో అప్డేట్.. ఆ పోస్టర్ ఏంటి బాసూ హాలీవుడ్ రేంజ్ లో ఉంది..

Jubilee Hills By Election: ఇక మిగిలింది మూడు రోజులే.. ప్రధాన పార్టీల అభ్యర్థుల వెనుక షాడో టీమ్స్..!