Telecom ( Image Source: Twitter)
బిజినెస్

Recharge Plans: మొబైల్ వినియోగదారులకు షాక్‌.. మళ్ళీ పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ ధరలు..

Recharge Plans: భారత టెలికాం రంగంలో మళ్లీ టారిఫ్ మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రిపోర్టుల ప్రకారం రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) సంస్థలు రాబోయే నెలల్లో మొబైల్ డేటా ప్లాన్‌ల ధరలను సుమారు 10% వరకు పెంచే అవకాశముంది. 2024 తర్వాత ఇది మొట్టమొదటి స్పష్టమైన ధర పెంపుగా ఉండనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మార్పులు టెలికాం కంపెనీలు తమ సగటు వినియోగదారుల ఆదాయం (ARPU) పెంచే వ్యూహంలో భాగంగా చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, కంపెనీలు అధికారికంగా టారిఫ్ పెంపు ప్రకటించకుండానే, తక్కువ ధర ప్లాన్‌లను క్రమంగా తొలగిస్తూ వినియోగదారులను అధిక విలువ కలిగిన ప్యాక్‌ల వైపు మళ్లిస్తున్నాయి.

వ్యూహం మార్చిన జియో, ఎయిర్‌టెల్

ఇటీవలి నెలల్లో జియో, ఎయిర్‌టెల్ తమ 1GB-ప్రతిరోజు ప్రీపెయిడ్ ప్లాన్‌లను నిలిపివేశాయి. దీని బదులుగా ఇప్పుడు ఎక్కువమందికి ప్రారంభ స్థాయి ప్లాన్‌లు 1.5GB-ప్రతిరోజు డేటా ప్యాక్‌లుగా మారాయి. ఈ కొత్త ప్యాక్‌లు సుమారు రూ.299 నుంచి ప్రారంభమవుతున్నాయి ఇది ఇంతకుముందు ఉన్న రూ.249 ప్లాన్ కంటే దాదాపు 17% ఎక్కువ. ఇక వొడాఫోన్ ఐడియా మాత్రం ఇప్పటికీ 1GB-ప్రతిరోజు ప్యాక్‌ను రూ.299కి అందిస్తోంది.

పెట్టుబడుల ఒత్తిడి, 5G వ్యయం కారణం

ఎయిర్‌టెల్, Vi సంస్థలు గతంలోనే టారిఫ్‌లను పెంచాల్సిన అవసరం ఉందని బహిరంగంగా పేర్కొన్నాయి. దీనికి కారణం కూడా ఉంది. టెలికాం రంగం అత్యధిక మూలధన వ్యయాలతో నడుస్తుంది, అలాగే 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. అందుకే కంపెనీలు నేరుగా ధరలు పెంచడం కాకుండా, తక్కువ ధర ప్యాక్‌లను తగ్గించి వినియోగదారులను ఎక్కువ ఖరీదైన ప్లాన్‌ల వైపు మళ్లిస్తున్నారు.

జియో ఏం చెబుతుందంటే?

రిలయన్స్ జియో తన Q2 FY26 ఫలితాల్లో కంపెనీ సగటు వినియోగదారుల ఆదాయం రూ.208.8 నుండి రూ.211.4 కి పెరిగిందని వెల్లడించింది. అయితే, కంపెనీ స్పష్టంగా “ ప్రస్తుతం ఎటువంటి టారిఫ్ పెంపు ప్రణాళికలు లేవు ” అని తెలిపింది. అయినా కంపెనీ అధికారులు వినియోగదారులను “ ఇంకాస్త ఎక్కువగా వినియోగించి, ఎక్కువ చెల్లించేలా ” ప్రోత్సహిస్తున్నామని అంగీకరించారు. దీని వలన  లాభాల కంటే దీర్ఘకాలిక స్థిర వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.

టెలికాం రంగం మళ్లీ వినియోగదారుల ఖర్చును పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ కంపెనీల నుంచి అధికారిక ప్రకటనలు రాకపోయినా, తక్కువ ధర ప్లాన్‌లను తొలగించడం ద్వారా ఇప్పటికే వినియోగదారుల బిల్లులు పెరిగే పరిస్థితి ఏర్పడింది.

Just In

01

Maganti Family Dispute: మాగంటి అసలైన వారసుడ్ని నేనే.. నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ప్రద్యుమ్న తారక్

CM Revanth Reddy: గెలుపు మనదే అయినా.. మెజారిటీ పై గురి పెట్టాల్సిందే కదా..!

Chikiri song out: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి ‘చికిరి’ సాంగ్ వచ్చేసింది..

Dharmapuri Arvind: నిజామాబాద్‌లో పొలిటికల్ లీడర్ల పేకాట అడ్డాలు.. వార్నింగ్ ఇచ్చిన ఎంపి అరవింద్

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్?