సత్తుపల్లి స్వేచ్చ: Palm Oil In Khammam: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పామాయిల్ సాగు ఏర్పాటులో ఖమ్మం జిల్లాకు అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చింది. ఈ ప్రాంతంలోఅను వైన భూములు ఉండటం వల్ల రైతులు కూడా తమకున్న భూమిలో వరి పంటలు, ఇతర అపరాల పంటలు కూడా వదిలేసి పామాయిల్ సాగుకు ఆసక్తి చూపించారు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల పామాయిల్ సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఇండోనేషియా, మలేషియా దేశాల నుండి ఆయిల్ ఫెడ్ వారు పామాయిల్ మొలకలను దిగుమతి చేసుకొని, నర్సరీలో మొక్కలు పెంచి రైతులకు విక్రయిస్తున్నారు.
రైతులకు ఒక్కొక్క మొక్కను 200 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనిలో రైతుల వాటా పోను ఒక్కొక్క మొక్కకు ప్రభుత్వం 180 రూపాయలు చెల్లిస్తుంది. 2020 వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు సుమారు అరుకోట్ల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం చెల్లించినట్లు సమాచారం. ఇప్పటికే సత్తుపల్లి మండలం రేగళ్ల పాడు నర్సరీలో 70 నుంచి 80% మొక్కలు ఆఫ్ టైఫ్ (నపుంసపు) గా గుర్తించారు. అలాగే అశ్వరావుపేట, నారంవారిగూడెం నర్సరీల్లో కూడా భారీ ఎత్తున ఆఫ్ టైప్ మొక్కలు రోజు, రోజుకి వెలుగు లోకి వస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున ఆఫ్ టైప్ మొక్కల పెంపకం ఎందుకు జరిగిందో ఇప్పటికి అధికారుల దగ్గర కానీ, ప్రభుత్వం దగ్గర కానీ సరియైన సమాధానం లేదని రైతులు విమర్శిస్తున్నారు.
Also Read: Warangal Bikes Theft: భలే దొంగ.. సూపర్ ఐడియా వేశాడు.. ఎట్టకేలకు చిక్కాడు..
అంతేగాక ఈ విషయాలు అన్ని అధికారులకు తెలిసే చేసారని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నర్సరీలపై కొంత మేర విచారణ చేపట్టినప్పటికి, రైతులకు మేలు జరగలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సాహంతో రైతులు పామాయిల్ తోటలు అధికంగా సాగు చేస్తున్నారు. కానీ ఇటువంటి అవకతవకల వలన రైతులు నిరుత్సాహ పడుతున్నారు. మొక్కలపై ఏమాత్రం అవగాహనలేని రైతులకు అధికారులు తెలిసే అఫ్ టైప్ మొక్కలు అంటగట్టారని బహిరంగగానే చర్చించుకుంటున్నారు.
ఆఫ్ టైప్ మొక్కలపై అనుమానాలు:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు లక్ష ఎకరాలు ఈ పంట ను సాగు చేస్తున్నారు. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్నట్టు నాటిన మొక్కల్లో సుమారు 60,70 శాతం ఆఫ్ టైప్ మొక్కలు కావడం వలన, కాపు రాక పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు వచ్చి కనీసం తమ పంటలు కూడా పరిశీలించడం లేదని రైతులు వాపోతున్నారు. ఆఫ్ టైప్ మొక్కలపై ఇప్పటికే పలువురు రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రతి రోజు ఈ అఫ్ టైప్ మొక్కలు ఎక్కడో ఓ చోట బయట పడుతూనే ఉన్నాయి.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో జగ్గవరపు దామోదర్ రెడ్డికి చెందిన తోటలో కూడ ఇటీవల బయట పడ్డాయి. తన చేలో నాలుగు ఎకరాల్లో 200 మొక్కలు నాటితే, అందులో 100 మొక్కలు పైగా అఫ్ టైప్ మొక్కలే వచ్చాయని ఆందోళన చెందుతున్నాడు. దయచేసి అధికారులు,ప్రభుత్వం దృష్టి పెట్టి న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.
2021 సంవత్సరంలో అశ్వరావుపేట ఆయిల్ ఫెడ్ నర్సరీ నుంచి మొక్కలు తీసుకువచ్చానని, ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టానని, మొక్కలు కాపు రాక నష్టపోయానని తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/