ఖమ్మం స్వేచ్ఛ: Khammam Priest: ఖమ్మంలో అమానుష సంగటన జరిగింది. గికిజన యువకున్ని కులాన్ని అంటగట్టి అవమానించాడు ఓ పూజారీ. కాలం మారుతున్న కొంత మంది మాత్రం కులం వివక్షతతో జీవిస్తున్నారు. తక్కువ వారికి జంజం లేదని వారికి పూజలు చేయనని స్టేజి దిగి పురోహితుడు వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఖమ్మం నగరంలోని గోపాలపురంలో నవమి రోజున రాములోరి కల్యాణానికి కూర్చున్న బాణోత్ సైదులు దంపతులకు పూజలు చేయకుండా పురోహితుడు వివక్ష చూపెట్టాడని బాధితుడు ఆరోపిస్తూ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.
బాణోత్ సైదులు సినీ పరిశ్రమలో పని చేస్తు శ్రీరామ నవమికి తన గ్రామంలో రాములవారికళ్యాణంలో పీటల పై కూర్చున్నట్లు పేర్కొన్నారు. తాను గ్రామంలోని పెద్దలు కమిటీ సభ్యులు చెప్పినందుకే పీటలపై కూర్చొన్నానని పురోహితుడికి చెప్పినా వినకుండా జంజం లేదు కాబట్టి ఈ పూజకి ఆయన అనర్హుడిగా భావిస్తున్నట్లు బహిరంగంగా చెప్పాడని తెలిపాడు. ఈ విషయం స్థానిక ప్రజలన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి వివక్షకు గురి చేసి అవమానించేది ఉంటే కూర్చునే వాడిని కాదని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ బాధితుడు.
తాను ఎస్టీ కులస్థుడు కావడంతోనే తనపై వివక్ష చూపారని భాదితుడు ఆరోపించాడు. తన కుటుంబం ముందు తనను కుల పరంగా అవమానించిన పురోహితుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు సోషల్ మీడియా వీడియోలో ఆవేదన వ్యక్తంచేశారు. తనకు జరిగిన అవమానాన్ని చూసిన తన కుమార్తె స్కూల్ లో లేని వివక్ష గుడిలో ఎందుకు చూపెట్టారని కన్నీటిపర్యంతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/