Telangana Mangoes (imagecredir:swetcha)
ఖమ్మం

Telangana Mangoes: ఈ మామిడి పండు రుచి, రేటు.. అంతకుమించి!

Telangana Mangoes:  దేశానికి చెందిన మియాజాకీ (Miyazaki) రకం మామిడి (Mango) పండు ఇప్పుడు ట్రెండీగా మారింది వైరల్ అవుతోంది. మియాజాకీ మామిడిపండు రకం జపాన్ (Japan) దేశంలోని మియాజాకీ ప్రాంతంలో పండించడంతో ఆ పేరు మామిడి కి వచ్చింది. జపాన్ తో పాటు కాలిపోర్నియా వంటి ఇతర ప్రాంతాల్లో మాత్రమే ఈ మామిడి రకం పంటను రైతులు సేద్యం చేస్తుంటారు. అయితే ఈ మామిడి రకం పంట క్షేత్రానికి ఖమ్మం జిల్లా కేరాఫ్ అడ్రస్ గా మారింది. అందుకు 2020 కరోనా లాక్ డౌన్ సరైన సమయంగా ఈ పంట చేసేందుకు అనుకూలమైంది. ఖమ్మం (Khammam) జిల్లా రూరల్ మండలం శ్రీసిటీకి చెందిన గరికపాటి ఆంజనేయ ప్రసాద్ తన వ్యవసాయ క్షేత్రంలో మామిడి తోటను సేద్యం చేస్తున్నాడు. విశాలమైన వ్యవసాయ క్షేత్రంలో మరిన్ని లాభాలు ఆర్జించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు సాగించాడు. తెలిసిన వారి ద్వారా మియాజాకీ మేలైన మామిడిపండు రకం గురించి తెలుసుకున్నాడు. ఇంకేముంది కాలిఫోర్నియా నుంచి ఒక్కో మొక్కకు 12000 వెచ్చించి 30 మొక్కలను దిగుమతి చేసుకున్నాడు. 2020 నుంచి 2024 వరకు మామిడి రకానికి చేయాల్సిన శ్రమను చేశాడు. అవి ప్రస్తుతం “పల”హారంగా ఆయనకు ఫలాలను ఇస్తున్నాయి.

మామిడిపండు రేటు అక్షరాల రూ.3 లక్షలు

పేరుకు ఈ ఫ్రూట్ మామిడిపండే కానీ దీని రేట్ ఎంతో తెలుసా? తెలిస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే. అక్షరాల ఈ ఫ్రూట్ కేజీ ఖరీదు రూ.3 లక్షలు అంటే ఎవరు నమ్మరు కదా! పూర్తిగా తెలిస్తే మీరే అవును కదా! అంటారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం శ్రీ సిటీకి చెందిన గరికపాటి ఆంజనేయ ప్రసాద్ తన వ్యవసాయ క్షేత్రంలో కాలిఫోర్నియా నుండి తీసుకొచ్చిన మామిడి మొక్కలను నాటి సేద్యం చేశారు. ప్రస్తుతం అవి మామిడిపండుగా చేతికొచ్చాయి. ఒక్కో చెట్టుకు 100 నుండి 150 కాయలు దిగుబడి వస్తున్నాయి. ఒక్కో కాయ బరువు 500 గ్రాముల నుండి 800 గ్రాముల వరకు ఉన్నాయి. ఒక్కో కేజీ ధర ఖమ్మం లో రూ.2.5 లక్షలు పలుకుతుండగా, ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం అక్షరాల రూ.3లక్షల విలువ ఉంటుంది.

తెలంగాణలో జపాన్ మియాజాకీ మామిడి ఫ్రూట్

గత కొన్ని సంవత్సరాల క్రితం జపాన్, కాలిఫోర్నియా దేశంలోనే కొన్ని ప్రాంతాలకు పరిమితమైన మియాజాకి మామిడి ఫ్రూట్ ఇప్పుడు తెలంగాణలో కూడా లభ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు శ్రీ సిటీ కి చెందిన గరికపాటి ఆంజనేయ ప్రసాద్ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాలిపోర్నియా నుండి తీసుకొచ్చిన 30 మొక్కలను ఓ ఎకరంలో సేద్యం చేస్తూ అధిక లాభాలను ఆశిస్తున్నాడు. ఇంకా లాభాలు పొందేందుకు మరో ఎకరంలో ఆంధ్రప్రదేశ్ లోని కడియం నుంచి ఒక్కో మొక్కకు 3500 వెచ్చించి 120 మొక్కలను దిగుమతి చేసుకొని నాటాడు.

ఉత్సాహం చూపుతున్న ఉన్నత వర్గాలు

జపాన్ దేశంలో పురుడు పోసుకున్న మియాజాకీ రకం మామిడి ఫ్రూట్ ఆ తర్వాత కాలిపోర్నియా దేశంలోకి పాకింది. అక్కడి నుంచి ఆదర్శ భావాలున్న ఖమ్మం జిల్లా రైతు గరికపాటి ఆంజనేయ ప్రసాద్ వ్యవసాయ క్షేత్రంలోకి చేరింది. నేడు ఈ ఫ్రూట్ కోడ్ కోసం తెలంగాణలోని ఉన్నత వర్గాలు ఉత్సాహం చూపుతున్నాయి. ఏదైనా ఫంక్షన్లలో ఈ ఫ్రూట్ ను ఆహారంగా అందిద్దామని కాన్సెప్ట్ తో ఫంక్షన్లను మార్చుకుంటున్నారు. అతి ఖరీదైన మీయాజాకి ఫ్రూట్ ను ఆహారంలో అందించేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఒక ముక్క అయినా చాలు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆలోచనతో ఉన్నత వర్గాలు ఈ ఫ్రూట్ పై మక్కువ పెంచుకుంటున్నారు.

ఈ ఫ్రూట్ తింటే ఆరోగ్యానికి మేలు

జపాన్ దేశానికి సంబంధించిన ఈ మియాజాకీ ఫ్రూట్ మామిడి రకం తింటే ఆరోగ్యాలకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుందని హార్టికల్చరల్ అధికారులు వెల్లడిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్లు (సి, ఈ, ఏ, కె), మినరల్స్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, బీటా కెరోటిన్, పోలిక్ యాసిడ్, జింక్ వంటివి లభిస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ను నిరోధించడంతోపాటు కొలెస్ట్రాల్, ఊబకాయాన్ని తగ్గించడంతో పాటు కంటి సమస్యలను సైతం నివారించడంలో సత్ఫలితాలు అందిస్తాయి. శరీరంలోని తరచూ సంభవించే మలబద్ధకం అజీర్ణం కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి మియాజాకీ ఎంతో మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

మియాజాకీ ఇక్కడి భూములకు అనుకూలమే

నియా జాకీ రకం మామిడిపండు తెలంగాణ రాష్ట్రంలోని భూముల్లో పండించుకునేందుకు అనుకూలంగానే ఉంటుంది. ఎక్కువమంది రైతులు ఈ మామిడిని సేద్యం చేస్తే మార్కెటింగ్ చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. 2020 నుంచి హార్టికల్చరల్ అధికారులు చేసిన సూచనలతో పంటను ప్రత్యేక పద్ధతిలో చేయడం అనుసరించాను. ఈ రకం పండ్లు మంచి వాసన, రుచి కరంగా ఉంటాయి. పండ్ల రకాల్లోనే రారాజైన మియాజాకీ మామిడి పండుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

Also Read: Village Secretaries: పల్లెలో ఆ సమస్య తీరినట్లే… లేదంటే చర్యలే!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?