CM Revanth Reddy (image credit:Twitter)
ఖమ్మం

Sri Rama Navami 2025: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు..

Sri Rama Navami 2025: దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రి భక్త జనసంద్రంగా మారింది. ఎటు చూసినా శ్రీరామ నామం ప్రజ్వరిల్లింది. ఆ దేవదేవుల ఆశీస్సులతో శ్రీ సీతారాముల కళ్యాణ వైభవం అంగరంగ వైభవంగా సాగింది. అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా.. అనే తీరులో రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. దీనితో భద్రాద్రి శ్రీరామనవమి పర్వదినం నాడు మరింత శోభాయమానంగా మారింది.

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ముస్తాబైంది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. ఉ.10.30 గంటలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాగా వేదపండితుల మంత్రోచ్చరణాల మధ్య సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. భద్రాద్రి భక్తజనసంద్రమైంది. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కళ్యాణమూర్తులను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకెళ్తుండగా అడుగడుగునా భక్తులు నీరాజనాలు పలికారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు.

ముత్యాల తలంబ్రాలతో కళ్యాణం
భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా సాగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో ముత్యాల తలంబ్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు వ్రేళ్లతో వడ్లు తీసి తలంబ్రాలు సమర్పించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం, ఏలూరులోని జంగారెడ్డిగూడెంకు చెందిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామ కోటిభక్త సమాజం కు చెందిన వారు, గత కొన్నేళ్లుగా గోటి తలంబ్రాలను స్వామి వారికీ సమర్పిస్తారు. ఇప్పటికే ముత్యాల తలంబ్రాలను పొందేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ సంస్థ ద్వారా కూడా బుక్ చేసుకొని ముత్యాల తలంబ్రాలను పొందే అవకాశాన్ని ఆలయ అధికారులు కల్పించారు.

Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
శ్రీరామనవమి పర్వదినం సంధర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆలయ మర్యాదలతో సీఎంకు, వారి కుటుంబసభ్యులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. సీఎం భద్రాద్రికి రావడం, అలాగే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వారి కుటుంబ సభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారు. అలాగే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా టీటీడీ తరపున రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా శ్రీరామనవమి సంధర్భంగా భద్రాద్రి ఆలయం రామనామంతో మారుమ్రోగింది.

ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు

శ్రీ సీతారాముల వారి కళ్యాణం సంధర్భంగా పెద్ద ఎత్తున రామ భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు వీక్షించే విధంగా  ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. రెండు రోజుల పాటు జరిగే శ్రీరామనవమి మహోత్సవాల సంధర్భంగా భక్తుల కోసం వేసవి కావడంతో మంచినీరు, మజ్జిగ అందించే కార్యక్రమాన్ని సైతం అధికారులు నిర్వహించారు.

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!